Viral Video: గర్ల్ ఫ్రెండ్ సైకిల్ తొక్కడం ఇష్టమని చెప్పింది.. కట్ చేస్తే.. ఊహించని షాకిచ్చిన ప్రియుడు..
అది కూడా కాస్త విభిన్నంగా సైకిల్ పై పడుకుని సైక్లింగ్ చేస్తున్నాడు. ఆమెకు సైక్లింగ్ ఇష్టమని చెప్పినప్పుడు.. నేను ఇలా చేస్తున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
గర్ల్ ఫ్రెండ్ ఇష్టాలను తెలుసుకోవాలనుకుంటాడు ప్రతి ప్రేమికుడు. ఆమెకు ఎలాంటి వస్తువులు.. ఫుడ్.. ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తమ ప్రేయసి అడిగిన వెంటనే ఎంతటి కష్టమైన పనిని అయిన చేసేందుకు వెనకడారు. అయితే తమ ప్రేయసికి ఇష్టమని.. ఆమెకు నచ్చిన పనిని స్మార్ట్‌గా చేసేవారు కూడా ఉంటారు. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి స్మార్ట్ గా ఆలోచిస్తే ఎక్కువ సమయం పట్టదంటున్నాడు ఆ యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఆ యువకుడు మరెవరో కాదు.. పాపులర్ సింగర్ దిల్జిత్ సింగ్. ప్రస్తుతం ఇంటర్నెషనల్ వెకెషన్లో ఉన్న దిల్జిత్ సింగ్.. విదేశాల్లో పలు లైవ్ షోస్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ నది పక్కన ఉన్న ట్రాక్ లపై సైక్లింగ్ చేశాడు. అది కూడా కాస్త విభిన్నంగా సైకిల్ పై పడుకుని సైక్లింగ్ చేస్తున్నాడు. ఆమెకు సైక్లింగ్ ఇష్టమని చెప్పినప్పుడు.. నేను ఇలా చేస్తున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం దిల్జిత్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.