
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 5వ తేదీన మహారియా గ్రామానికి చెందిన గీతా అనే ఐదుగురు పిల్లల తల్లి ఇంట్లోని నగదు, నగలను తీసుకుని అదే గ్రామానికి చెందిన నలుగురు పిల్లల తండ్రి గోపాల్‌తో పారిపోయింది. అంతేకాదు, వారిద్దరూ పెళ్లి చేసుకున్న ఫోటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం గురించి గీత భర్త శ్రీచంద్, గోపాల్ భార్యకు తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది.
అయితే, తొలుత తన భార్య ఆమె పుట్టింటికి వెళ్లి ఉంటుందని భావించిన ఆమె భర్త శ్రీ చంద్ మూడు రోజుల తర్వాత ఫేస్‌బుక్‌లో తన భార్య ఫోటోలను చూసి షాక్ తిన్నాడు. అదే గ్రామానికి చెందిన గోపాల్ అనే యువకుడితో తన భార్య పెళ్లి చేసుకున్నట్టుగా ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసి ఆ మహిళ భర్త శ్రీ చంద్ షాక్ అయ్యాడు.
ఇదిలా ఉంటే శ్రీ చంద్ కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సహా ఐదుగురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురికి దాదాపు 19 సంవత్సరాలుగా తెలిసింది. చిన్న కూతురికి ఐదేళ్లు. కాగా, శ్రీ చంద్ గతంలో ముంబైలోని ఒక వడా పావ్ దుకాణంలో పనిచేసేవాడని తెలిసింది. కానీ, గత కొన్ని రోజులుగా అతడు, స్వగ్రామంలోనే కూలీగా పనిచేస్తున్నాడని తెలిసింది.
అటు, శ్రీ చంద్ భార్యతో పారిపోయిన ప్రేమికుడు గోపాల్ పట్వాకు నలుగురు పిల్లలు ఉన్నారు. గోపాల్ ముంబైలో రాఖీ తయారీదారుగా కూడా పనిచేసేవాడని అతని భార్య చెప్పింది. అతను చాలా కాలంగా కుటుంబానికి ఖర్చులు ఇవ్వడం లేదని వాపోయింది. తాను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని చెప్పింది. తన భార్య ఇంట్లో నుంచి తీసుకెళ్లిన నగలు, రూ.90 వేలు తిరిగి ఇవ్వాలని, ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీ చంద్ చెప్పాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..