Viral Video: వీధిరౌడీల్లా రెచ్చిపోయిన ఆడ పిల్లలు.. బాలికపై తీవ్రంగా దాడి..

సోషల్ మీడియాలో అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని వీడియోలు మాత్రం మనసును ఎంతో హత్తకుంటాయి. తాజాగా నెట్టింట బాలికను కొడుతున్న ఓ వీడియో జోరుగా వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తుంటే నిజంగానే వీళ్లు ఆడ పిల్లలేనా అని అనిపిస్తుంది. అచ్చం వీధి రౌడీల్లా ప్రవర్తించారు. ఆడ పిల్లలు అయి ఉండి.. మరో ఆడ పిల్లను కింద పడేసి.. చిత్ర హింసలకు గురి చేశారు. దారుణంగా నడి రోడ్డు మీద జుట్టు..

Viral Video: వీధిరౌడీల్లా రెచ్చిపోయిన ఆడ పిల్లలు.. బాలికపై తీవ్రంగా దాడి..
Viral Video
Follow us
Chinni Enni

|

Updated on: Aug 26, 2024 | 4:23 PM

సోషల్ మీడియాలో అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని వీడియోలు మాత్రం మనసును ఎంతో హత్తకుంటాయి. తాజాగా నెట్టింట బాలికను కొడుతున్న ఓ వీడియో జోరుగా వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తుంటే నిజంగానే వీళ్లు ఆడ పిల్లలేనా అని అనిపిస్తుంది. అచ్చం వీధి రౌడీల్లా ప్రవర్తించారు. ఆడ పిల్లలు అయి ఉండి.. మరో ఆడ పిల్లను కింద పడేసి.. చిత్ర హింసలకు గురి చేశారు. దారుణంగా నడి రోడ్డు మీద జుట్టు లాగి కొట్టారు. అంతే కాకుండా బండ బూతులతో నోటికి వచ్చినట్టు వాగారు. బాలికను కాలితో తంతూ తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియోలో ఉన్న వారందరూ చిన్న పిల్లలే. ఒకే స్కూల్‌కి చెందిన స్టూడెంట్స్. అయితే వీళ్లందరూ మైనర్లు. వాళ్లతో అనుచితంగా ప్రవర్తించిందన్న కారణంతో ఓ విద్యార్థిని వీడియోలో కనిపిస్తున్న వారందరూ కలిసి దాడికి పాల్పడ్డారు. చేతులతో గుద్దుతూ, కాళ్లతో తన్నుతూ తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. వీళ్లలో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఒక్క ఆడ పిల్లను చేసి ఇంత మంది కలిపి కొట్టడం చాలా దారుణం. తోటి విద్యార్థిని కొడుతూ.. జుట్టు పట్టుకుని లాగారు. చాలా కిరాతకంగా.. వీడి రౌడీల్లా ప్రవర్తించారు. అయితే ముందు అక్కడున్న అబ్బాయిలు బాలికను విడిపించడంతో తప్పించుకుని వెళ్లిపోయింది.

అయితే మళ్లీ ఆ తర్వాత ఆ బాలిక దగ్గరకు వెళ్లి.. రెచ్చగొట్టి మళ్లీ తీవ్రంగా కొట్టారు. మళ్లీ కింద పడేసి చితకబాదారు. మరలా కాలితో తన్నారు. ఆ బాలిక వీళ్ల దగ్గర నుంచి విడిపించుకోలేక చాలా ఏడ్చింది. జుట్టుకు పట్టుకుని చాలా దారుణంగా హింసించారు. అయితే అక్కడున్న అబ్బాయిలు మళ్లీ విడిపించారు. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతుంది.

కాగా ఈ ఘటన కాస్తా పాఠశాల, తల్లిదండ్రుల దృష్టికి వెళ్లింది. దీంతో పేరెంట్స్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. పిల్లలు అందరూ మైనర్లు కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్లు తెలుస్తోంది. పిల్లల ప్రవర్తనపై స్కూల్ యాజమాన్యం కూడా స్పందించి తీవ్రంగా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ వీడియోపై నెటిజన్లు కూడా తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..