Viral Video: ఒక్కసారిగా బాంబులా పేలిపోయిన బైక్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న రోడ్ యాక్సిడెంట్!

ఒక భయంకరమైన ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లను భయభ్రాంతులకు గురి చేస్తోంది. బ్రెజిల్‌లోని చుక్విసాకా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఒక ప్రమాదకరమైన మలుపును స్థానికంగా కర్వా డా మోర్టే అనే పేరు పెట్టారు. అంటే "మరణ మలుపు" అని పిలుస్తున్నారు.

Viral Video: ఒక్కసారిగా బాంబులా పేలిపోయిన బైక్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న రోడ్ యాక్సిడెంట్!
Shocking Accident At Brazil

Updated on: Feb 01, 2026 | 7:24 PM

ఒక భయంకరమైన ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లను భయభ్రాంతులకు గురి చేస్తోంది. బ్రెజిల్‌లోని చుక్విసాకా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఒక ప్రమాదకరమైన మలుపును స్థానికంగా కర్వా డా మోర్టే అనే పేరు పెట్టారు. అంటే “మరణ మలుపు” అని పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక తీవ్రమైన ప్రమాదాలు జరిగాయి, కానీ ఈసారి జరిగినది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

వైరల్ వీడియోలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై అత్యంత వేగంగా దూసుకువస్తున్నారు. రోడ్డు కొద్దిగా మలుపు తిరుగుతుండగా, అకస్మాత్తుగా ఒక కారు ఎదురుపడింది.బైక్ రైడర్లకు స్పందించడానికి సమయం లేదు. క్షణాల్లోనే, మోటార్ సైకిల్ – కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ దెబ్బ చాలా తీవ్రంగా ఉండటంతో మోటార్ సైకిల్ వెంటనే మంటల్లో చిక్కుకుంది. కళ్ల ముందే కాలిబూడిదయ్యారు. వారి అర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ప్రమాదం తర్వాత పరిస్థితి మరింత భయంకరంగా మారింది. ఢీకొన్న ప్రభావంతో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపై నుంచి బోల్తా పడ్డాడు. పొగ, మంటలు, గందరగోళం ఎక్కడికక్కడ చెలరేగాయి. భయాందోళనకు గురైన కొందరు సహాయం కోసం పరుగెత్తారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది.

ఈ ప్రమాదంలో బైక్ రైడర్లు ఇద్దరూ అక్కడికక్కడే కాలిబూడిదై ప్రాణాలు కోల్పోయారు. మృతులను 42 ఏళ్ల డాల్మిర్ డోర్నెల్లెస్ లూప్స్, 37 ఏళ్ల జోసియన్ డోర్నెల్లెస్ లోప్స్‌గా గుర్తించారు. వారు ఇద్దరు బంధువులు, వ్యక్తిగత పనులపై ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో వారిని రక్షించే అవకాశం లేకుండాపోయింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇదిలావుంటే, ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అయిన 72 ఏళ్ల వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పి, మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన మలుపు వద్ద ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. రహదారి ఇరుకైనది. ఎదురుగా వచ్చే వాహనాలను నిర్ధారించడం కష్టం. అందువల్ల, ఒక వాహనం అధిక వేగంతో కదులుతుంటే, ప్రమాదం జరిగే ప్రమాదం విపరీతంగా పెరుగుతుంది.

ఈ కూడలిలో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ, తగిన హెచ్చరిక బోర్డులు లేవు. వేగ పరిమితులను కఠినంగా అమలు చేయలేదు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు, సూచికలు, భద్రతా చర్యలను చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మరోసారి అతివేగం వల్ల కలిగే ప్రమాదాలను గుర్తు చేస్తుంది. కొన్ని సెకన్ల అజాగ్రత్త, తొందరపాటు ప్రాణాలను ఎలా బలిగొంటుందో ఈ ప్రమాదం స్పష్టంగా చూపిస్తుంది.

వీడియోను ఇక్కడ చూడండిః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..