
ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని ప్రాంతాలలో సోమవారం రాత్రి భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. దీని వలన న్యూయార్క్ నగరంతో పాటు న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాలు స్పందించిపోయాయి. తుఫాను కారణంగా సబ్‌వే లైన్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రోడ్లు నీటమునిగాయి. న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితిని విధించారు. న్యూయార్క్, న్యూజెర్సీ పరిసర ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. న్యూజెర్సీలో గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలేవరూ బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని కోరారు.
వీడియో ఇక్కడ చూడండి..
అమెరికా నైరుతి రాష్ట్రాలైన న్యూయార్క్, న్యూజెర్సీలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. రహదారులు, రైలు మార్గాలు నీట మునిగిపోయాయి. న్యూయార్క్ నగరంలో కొన్ని మెట్రో సేవలు నిలిపివేయగా, మరికొన్నింటిపై తీవ్ర ప్రభావం పడింది. మాన్‌హాటన్ మెట్రో స్టేషన్‌ను వర్షపు నీరు ముంచెత్తింది. కొంతమంది ప్రయాణికులు నీటిని తప్పించుకోడానికి ట్రెయిన్ సీట్లపై నిలబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
🚨BREAKING: Heavy rain is flooding NYC subway stations as storms hit the area.
pic.twitter.com/s3AYqSxhOT— Benny Johnson (@bennyjohnson) July 15, 2025
భారీ వర్షాల కారణంగా ఈశాన్య యునైటెడ్ స్టేట్స్ అంతటా వరదలు సంభవించాయి. దీని వలన న్యూయార్క్ నగరం, న్యూజెర్సీ స్తంభించి పోయాయి. సబ్‌వే లైన్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రోడ్లు నీటమునిగిపోయాయి. న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అత్యవసర బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..