
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బర్త్ డే నేడు. ఆమె 37వ పడిలోకి అడుగుపెడుతుంది. ఈ ప్రత్యేకమైన రోజున, ఆమె భర్త, పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్.. సూపర్ కూల్‌గా సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పాడు. ఈ జంట విడిపోతున్నారన్న రూమర్స్ మధ్య.. అతని ట్వీట్ ఇంట్రస్టింగ్‌గా మారింది. “నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు చాలా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను! ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు” అని రాసుకొచ్చాడు. ప్రజంట్ అతని పోస్ట్ వైరల్‌గా మారింది. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ఏప్రిల్ 2010లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2018లో కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు.
Happy Birthday to you @MirzaSania Wishing you a very healthy & happy life! Enjoy the day to the fullest… pic.twitter.com/ZdCGnDGLOT
— Shoaib Malik ?? (@realshoaibmalik) November 14, 2022
మీర్జా- మాలిక్. ఈ జంట ప్రస్తుతం ఇంటర్నేషనల్లీ వైరల్ గా మారిన సెలబ్రిటీ జంట. వీరు విడిపోతున్నట్టు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్. ఇంతలో మీర్జా మాలిక్ షో అంటూ ఉర్దూ ఫ్లిక్స్ ఒక ఫోటో విడుదల చేసింది. ఈ షో కోసమే వీరిద్దరూ విడిపోతున్నట్టు పుకార్లు షికార్లు చేశాయనీ.. అంతే తప్ప.. వీరు విడిపోవడం ఎంత మాత్రం జరగదన్న మాట ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ షో ఇప్పటిది కాదనీ.. ఇది 2021 డిసెంబర్ లోనే అనౌన్స్ అయ్యిందనీ. ఈ షో ఎఫెక్ట్ కాకూడదనే.. వీరి డైవర్స్ వాయిదా పడిందనీ అంటారు మరి కొందరు. ఈ సందర్భంగా ఒక మోడల్ తో షోయబ్ మాలిక్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వివాహేతర సంబంధమే.. వీరి విడాకులకు కారణమన్న చర్చ కూడా జోరుగా సాగింది. అయితే తమ డైవర్స్ పై ఈ సెలబ్రిటీ జంట ఇంత వరకూ నోరు మెదపలేదు. పైగా.. మీర్జా మాలిక్ షోకు సంబంధించిన న్యూస్ చక్కర్లు కొట్టడంతో.. మొత్తం టాపిక్ అటు డైవర్ట్ అయ్యింది. తాజాగా షోయబ్ నుంచి బర్త్ డే ట్వీట్ కూడా వచ్చేసింది. ఇంతకీ వీరు విడిపోతున్నారంటూ వచ్చిన గాసిప్స్ కేవలం పబ్లిసిటీ స్టంటా? లేక ఈ షో కారణంగానే వీరు విడిపోవడం వాయిదా వేసుకోవల్సి వచ్చిందా తేలాల్సి ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి