Watch: వార్నీ.. వీళ్లను మేకప్‌ లేకుండా చూసుడు కష్టమే..! ఎయిర్‌పోర్టులో మహిళకు వింత అనుభవం..

పండుగలు,పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి ప్రత్యేక రోజులు మాత్రమే కాదు..ప్రతి రోజూ మేకప్‌ వేస్తుంటారు చాలా మంది. అసలు రోజు వేకప్‌ అయింది మొదలు డే మొత్తం మేకప్‌ చేసుకుంటూనే ఉంటారు మరికొందరు.. గంట గంటకు ముఖానికి ఏదేదో రుద్దేస్తూ ముఖం అసలు రూపంతో పాటు..వయసును కూడా దాచేస్తుంటారు చాలా మంది..ఇందులో సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మేకప్‌ పిచ్చికి అతీతులేం కాదండోయ్..

Watch: వార్నీ.. వీళ్లను మేకప్‌ లేకుండా చూసుడు కష్టమే..! ఎయిర్‌పోర్టులో మహిళకు వింత అనుభవం..
Woman Wiping Off Makeup

Updated on: May 31, 2025 | 1:18 PM

నేటి కాలంలో మనిషి నుగడకు నీరు ఎంత ముఖ్యమో.. అమ్మాయిలకు మేకప్ కూడా అంతే ముఖ్యం. ముఖానికి మేకప్, పెదాలు లిప్‌స్టిక్‌ లేకుండా ఇంటి నుంచి కాలు బయటపెట్టరు చాలా మంది. పండుగలు,పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి ప్రత్యేక రోజులు మాత్రమే కాదు..ప్రతి రోజూ మేకప్‌ వేస్తుంటారు చాలా మంది. అసలు రోజు వేకప్‌ అయింది మొదలు డే మొత్తం మేకప్‌ చేసుకుంటూనే ఉంటారు మరికొందరు.. గంట గంటకు ముఖానికి ఏదేదో రుద్దేస్తూ ముఖం అసలు రూపంతో పాటు..వయసును కూడా దాచేస్తుంటారు చాలా మంది..ఇందులో సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మేకప్‌ పిచ్చికి అతీతులేం కాదండోయ్..ఇలా మేకప్‌లో చూసిన వాళ్లను మేకప్‌ లేకుండా చూస్తే మాత్రం దాదాపుగా గుర్తుపట్టలేమని చెప్పాలి. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చైనాలోని షాంఘై విమానాశ్రయంలో ఒక అమ్మాయికి ఇలాంటిదే జరిగింది. విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ సమయంలో ఆమె ముఖం, ఆమె పాస్‌పోర్ట్‌తో సరిపోలకపోవడంతో సిబ్బంది ఆమెను మేకప్ తొలగించమని కోరారు. ఈ సంఘటన షాంఘై విమానాశ్రయంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వీడియోలో ఆ యువతి సిగ్గుతో తల దించుకుని.. తన ముఖం మీద ఉన్న మేకప్‌ను తుడుచుకుంటూ కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ముఖానికి మందంగా మేకప్‌తో వచ్చిన అమ్మాయిని ఎయిర్‌ పోర్ట్‌ సాధారణ తనిఖీల్లో గుర్తుపట్టలేకపోయారు అక్కడి అధికారులు. ఎందుకంటే..ఆమె పాస్‌పోర్ట్‌ మీద ఉన్న ఫోటోకి ఇక్కడ విమానాశ్రయంలో ఉన్న మహిళ ముఖానికి ఏ మాత్రం పొంతనలేకుండా ఆమె మేకప్‌ వేసుకుందని తెలిసింది. దాంతో సంబంధిత అధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగి ఆమెను నీ పాస్‌పోర్ట్ ఫోటోలా కనిపించే వరకు మేకప్ అంతా తుడిచివేయి అంటూ మండిపడ్డాడు. ఎందుకు అంతగా మేకప్ వేసుకున్నావ్‌ అంటూ అధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రైడల్-లెవల్ మేకప్ వేసుకుందని, దాంతో ఇక్కడి మెషీన్‌ ఆమెను గుర్తించలేకపోయిందని అధికారులు తెలిపారు. చివరకు ఆమె ఇమ్మిగ్రేషన్ ద్వారా వెళ్ళిందా లేదా అనేది తెలియదు. కానీ, ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్‌ అవుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

క్లిప్‌ను @wchinapost అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియో వైరల్ అయిన వెంటనే, వినియోగదారులు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఈ సంఘటనను కొంతమంది ఎగతాళి చేయగా, మరికొందరు ఆ మహిళ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. బాబోయ్.. ‘మెషిన్ కూడా గుర్తుపట్టలేనంత మేకప్ ఉంది’ అంటూ మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..