Viral Video: వార్నీ అక్కడెలా బ్రో.. ప్రయాణికుల ప్రవర్తనపై అనుమానం.. ఆపి చెక్‌ చేయగా..

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ మొత్తంలో బంగారం పట్టుపడింది. కౌలాలంపూర్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుండి రూ. 3.36 కోట్ల విలువైన 2.271 కిలోల 24-క్యారెట్ల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

Viral Video: వార్నీ అక్కడెలా బ్రో.. ప్రయాణికుల ప్రవర్తనపై అనుమానం.. ఆపి చెక్‌ చేయగా..
Hyderabad Airport Gold Smuggling

Updated on: Jun 26, 2026 | 3:47 PM

అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడిన ఘటన హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 24వ తేదీన కౌలాలంపూర్‌ నుంచి ఇద్దరు ప్రయాణికులు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. అయతే ఫ్లైట్ దినిన తర్వాత ఎయిర్‌పోర్టు చెకింగ్ పాయింట్ వద్దకు వచ్చిన వారి ప్రవర్తణపై అనుమానం రావడంతో వారిని ఎయిర్‌ పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు.

వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన పాకెట్‌లో పేస్ట్‌ రూపంలో ఉన్న బంగారం కనిపించింది. దాన్ని బయటకు తీయగా మొత్తం 2.271 కిలోల 24-క్యారెట్ల స్వచ్చమైన బంగారాన్ని ఎలాంటి దృవీకరణ పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో దాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన బంగారం విలువ మార్కెట్‌లో రూ.3కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో వారిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకున్న కష్టమ్స్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us