AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పొట్టకూటి కోసం ప్రాణాలే పణంగా పెట్టిన కూలీ.. వీరికెవరు భరోసా.! నెట్టింట ట్రెండింగ్..

ప్రతీ రోజూ ఇంటర్నెట్‌లో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాక్‌కు గురయ్యేలా ఉంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట..

Viral Video: పొట్టకూటి కోసం ప్రాణాలే పణంగా పెట్టిన కూలీ.. వీరికెవరు భరోసా.! నెట్టింట ట్రెండింగ్..
Viral
Ravi Kiran
|

Updated on: Jun 15, 2023 | 11:33 AM

Share

ప్రతీ రోజూ ఇంటర్నెట్‌లో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాక్‌కు గురయ్యేలా ఉంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ కూలీ పొట్టకూటి కోసం ప్రాణాలకు తెగించి మరీ పని చేస్తున్నాడు. చావు కంటే.. ఆకలి పోరాటమే చాలా కష్టం అనడానికి నిదర్శనంగా నిలిచే ఈ వీడియో చూస్తే మీరూ షాక్ కావడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. నిర్మాణ పనుల్లో భాగమైన ఓ యువకుడు.. భూమిపై నుంచి ఎన్నో అడుగుల ఎత్తులో పని చేస్తున్నాడు. కేవలం రెండు కర్రల సాయంతో ఉన్న ఓ చెక్కపై అతడు ఎటువంటి ఆత్మరక్షణా లేకుండా స్లాబ్ కోసం మిగతా చెక్కలు అమరుస్తున్నాడు. నిజానికి ఈ పని చేయాలంటే.. చాలామంది జంకుతారు. ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా.. ఈ వర్క్ చేస్తే.. ప్రాణాలు పోయినట్లే. చావు కంటే ఆకలి బాధలు భరించడమే చాలా కష్టమని చెప్పే.. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఖంగుతిన్నారు. పొట్టకూటి కోసం రోజూవారి కూలీలు ప్రతీరోజూ రిస్క్ చేస్తూనే ఉంటారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు 47 వేల వరకు వ్యూస్ రాగా.. వెయ్యికి పైగా లైకులు వచ్చాయి. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.