ఓ వైద్యుడు చేసిన నిర్వాకం.. అతడ్నే చిక్కుల్లోకి నెట్టేసింది. కట్ చేస్తే.. పంచాయితీ కాస్తా కోర్టుకెళ్లింది. అతడి పేరు బ్లాక్ లిస్టులో చేరింది. వివరాల్లోకి వెళ్తే.. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వైద్యుడు వీర్యదానం ద్వారా ఏకంగా 550 మందికి తండ్రి అయ్యాడు. ఇక ఇదే అతడికి పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఇకపై అతడు వీర్యదానం చేయకుండా అడ్డుకోవాలంటూ ఓ మహిళ కోర్టుకెక్కింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. సదరు మహిళ కూడా అతడి వీర్యం ద్వారానే బిడ్డకు జన్మనిచ్చింది.
ది హేగ్ నగరంలో నివాసముంటున్న 41 ఏళ్ల జొనధన్ ఎం అనే వైద్యుడు.. నెదర్లాండ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 13 క్లినిక్‌ల వీర్యదానం చేశాడు. ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు.
కానీ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. గరిష్ఠంగా 25 మంది చిన్నారులకు మాత్రమే జన్మనివ్వాలి. పలు కీలక అంశాల ఆధారంగా ఈ రూల్స్‌ను రూపొందించారు. అయితే వీర్యదానం ద్వారా జొనధన్ 2017లో వందకు పైగా చిన్నారులకు జన్మనిచ్చాడని తెలిసింది. దీంతో అప్రమత్తమైన నెదర్లాండ్స్ అధికారులు.. ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగంలో అతడి పేరును బ్లాక్ లిస్టు చేశారు.(Source)