మన్మోహన్ సింగ్ సంతకంతో ఉన్న 2 రూపాయల నోటు లక్షలు సంపాదిస్తుంది.. ప్రత్యేకత ఏంటంటే..?

|

Feb 05, 2022 | 6:55 PM

Two Rupee Old Note: పురాతన వస్తువులను సేకరించడం చాలా మందికి హాబీ. పాత నాణేలు, నోట్లు సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు.

మన్మోహన్ సింగ్ సంతకంతో ఉన్న 2 రూపాయల నోటు లక్షలు సంపాదిస్తుంది.. ప్రత్యేకత ఏంటంటే..?
Rare Two Rupees
Follow us on

Two Rupee Old Note: పురాతన వస్తువులను సేకరించడం చాలా మందికి హాబీ. పాత నాణేలు, నోట్లు సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ప్రపంచంలో సంఖ్యలు అదృష్టాన్ని తీసుకొస్తాయని విశ్వసించే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ నమ్మకంతో కొంతమంది ప్రత్యేక నంబర్లతో ఉన్న కరెన్సీ నోట్ల సేకరిస్తుంటారు. ఇందుకోసం ఆ కరెన్సీ నోటు అసలు విలువ కంటే ఎన్నో రెట్లు చెల్లించేందుకు కూడా వెనుకాడరు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొందరు లక్షాధికారులు అవుతున్నారు. ఇంట్లో కూర్చొని కేవలం రూ.2 నోటుతో లక్షలు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం.

786 సంఖ్యతో ఉన్న రెండు రూపాయల నోటు ఇప్పుడు లక్షలు సంపాదించే కేటగిరిలోకి వెళ్లింది. మీరు అలాంటి నోటును కలిగి ఉంటే చాలా డబ్బు పొందవచ్చు. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ 2 రూపాయల నోటుపై 786 నెంబర్‌ ఉండాలి. ఇస్లాంలో ఈ సంఖ్యని శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ నోటుకి లక్షల్లో చెల్లించడానికి సిద్ధమవుతారు. రెండో విశేషం ఏంటంటే ఈ నోటు గులాబీ రంగులో ఉండాలి. మూడో విషయం ఏంటంటే ఈ నోటులో ఆర్బీఐ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్ సంతకం ఉండాలి. మీరు ఈ 2 రూపాయల పాత నోటును ఆన్‌లైన్ వేలంలో విక్రయించవచ్చు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.

సేల్‌ ఎలా చేయవచ్చు..?

అటువంటి నోట్లను విక్రయించడానికి మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. మీరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ eBay, క్లిక్ ఇండియా వంటి సైట్‌లలో ఇంట్లో కూర్చొని విక్రయించవచ్చు. ఇక్కడ ప్రజలు లక్కీ నోట్స్ కోసం చూస్తుంటారు. క్లిక్ ఇండియాలో వాట్సాప్ ద్వారా కూడా పాత నోట్లను విక్రయించవచ్చు. ఈబే వెబ్‌సైట్‌లో ఈ అరుదైన నోట్‌కి కొనుగోలుదారులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు. ముందుగా మీరు ఈబేలో విక్రేతగా నమోదు చేసుకోవాలి. మీ వివరాలను తెలపడం ద్వారా ఖాతాను సృష్టించాలి. తర్వాత నోట్‌కు రెండు వైపులా ఉన్న ఫోటోలని అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నంబర్ ఈ-మెయిల్ ఐడి మొదలైనవి నమోదు చేయాలి. వెబ్‌సైట్‌లో మీరు తెలిపిన సమాచారాన్ని ధృవీకరించాలి. ఇప్పుడు కొనుగోలు చేయాలనుకునేవారు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు.

IND vs WI: టీమ్‌ ఇండియాలోకి మళ్లీ ‘కుల్చా’ జోడి.. మ్యాజిక్‌ పనిచేసేనా..?

చాణక్య నీతి: భార్యాభర్తల మధ్య ఈ విషయాల ప్రస్తావన రాకూడదు.. వచ్చిందంటే బంధం బలహీనం..?

Viral Photos: రష్యాలోని టెంబులాట్ ఎర్కెనోవ్ కోట చాలా ఫేమస్‌.. దీనిని ఒక వ్యాపారవేత్త నిర్మించారు..?