Viral Video: ఆగి ఉన్న కారును ఢీకొట్టిన స్కూటర్ దొంగలు.. తర్వాత ఏం జరిగిందంటే..!

Viral Video: బైక్‌లను దొంగతనం చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. బైక్‌కు హ్యాండిల్‌ లాక్‌ వేసినా దొంగలు సులభంగా తీసివేసి దొంగిలిస్తుండటం ఎన్నో జరుగుతున్నాయి..

Viral Video: ఆగి ఉన్న కారును ఢీకొట్టిన స్కూటర్ దొంగలు.. తర్వాత ఏం జరిగిందంటే..!

Updated on: Nov 26, 2021 | 11:57 AM

Viral Video: బైక్‌లను దొంగతనం చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. బైక్‌కు హ్యాండిల్‌ లాక్‌ వేసినా దొంగలు సులభంగా తీసివేసి దొంగిలిస్తుండటం ఎన్నో జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలను పార్కింగ్‌ చేయడమే పాపమైపోతుంది. ఇలాంటి బైక్‌లపై దొంగలు కన్నేసి ఉంచుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా దొంగతనం చేయడం అలవాటుగా మార్చుకుంటున్నారు. కానీ ఓ బైక్‌ను దొంగతనం చేసి పారిపోతుండగా, ప్రమాదవశాత్తు ఆగివున్న కారును ఢీకొట్టారు. ఇలాంటి ఘటన యూకేలోని మాంచెస్టర్‌ ఓల్డ్‌ ట్రాఫోర్ట్‌లో చోటు చేసుకుంది.

ఈ వీడియో సీసీపుటేజీలో రికార్డు అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి తీసుకెళ్తుండగా, రహదారిలో ఆగివున్న ఓ కారును ఢీకొట్టి కిందపడిపోయారు. కానీ దొంగకి తీవ్ర గాయాలు కాగా, అంబులెన్స్‌ కోసం కాల్‌ చేయండి అంటూ అక్కడున్న వారిని వేడుకున్నాడు. అయితే మరో దొంగ గాయాలైనా పాలైనా కూడా ఆ బైక్‌ను ఎత్తుకెళ్లాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చేలోగా వారు పారిపోయారు.

ఇవి కూడా చదవండి:

Strange Incident In Tirupati: తిరుపతిలో వింత ఘటన.. భూమిని చీల్చుకొని బయటకు వచ్చిన వాటర్ ట్యాంక్..(వీడియో)

Viral Video: గుక్క పెట్టి ఏడుస్తున్న కోడిపల్ల.. ఇక శాకాహారులమే అంటున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో మీకోసం..