Viral video: హైటెన్ష‌న్ వైర్ల‌లో చిక్కుకున్న స్కూట‌ర్.. ఎలా ఎగిరిపోయిందంటారు..?

|

Jun 21, 2023 | 8:26 PM

జూన్ 18న తుపాన్ కార‌ణంగా స్కూట‌ర్ ఆ వైర్ల‌లో చిక్కుకుంద‌ని భావిస్తున్నారు. అంత ఎత్తులోకి స్కూటర్ ఎలా చేరిందనే దానిపై ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ, ఇంటర్‌నెట్‌ వినియోగదారులు మాత్రం రకా రకాల మీమ్స్‌తో పిచ్చేకిస్తున్నారు. సంఘటన స్థలంలో చాలా మంది ప్రజలు గుమిగూడి స్కూటర్‌ని చూస్తూ వీడియోలు తీస్తున్నారు.

Viral video: హైటెన్ష‌న్ వైర్ల‌లో చిక్కుకున్న స్కూట‌ర్.. ఎలా ఎగిరిపోయిందంటారు..?
Electricity Wires
Follow us on

ప్రాణాంతకమైన ఫుడ్ కాంబోలు, డ్యాన్స్ రీల్స్ వంటివి మిలియన్ల కొద్దీ వైరల్ వీడియోలు, వింత సంఘనలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో ఎన్నో చూస్తుంటాం.. చైనాలో ఒక చోట బిల్డింగ్‌పై పార్క్‌ చేసిన కార్లను కూడా చూశాం. అయితే, ఈ సారి అలాంటిదే మరో వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక స్కూటర్ విద్యుత్‌ స్తంభం అంత ఎత్తులో హైటెన్ష‌న్ వైర్ల‌లో చిక్కుకున్న వీడియో నెటిజ‌న్ల‌ను షాక్‌కు గురిచేస్తోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. అస‌లు స్కూట‌ర్ అక్క‌డ‌కు ఎలా చేరింద‌నే సందేహం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కుమ్మరిస్తున్నారు.

అయితే, సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో జ‌మ్ములో రికార్డు చేసిన‌ట్టు తెలుస్తోంది. జూన్ 18న తుపాన్ కార‌ణంగా స్కూట‌ర్ ఆ వైర్ల‌లో చిక్కుకుంద‌ని భావిస్తున్నారు. అంత ఎత్తులోకి స్కూటర్ ఎలా చేరిందనే దానిపై ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ, ఇంటర్‌నెట్‌ వినియోగదారులు మాత్రం రకా రకాల మీమ్స్‌తో పిచ్చేకిస్తున్నారు. సంఘటన స్థలంలో చాలా మంది ప్రజలు గుమిగూడి స్కూటర్‌ని చూస్తూ వీడియోలు తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ట్విట్ట‌ర్ యూజ‌ర్ స్వ‌త్‌కాత్ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై ప‌లువురు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అయి ఉంటుంది..డైరెక్ట్ చార్జింగ్ అని ఓ యూజ‌ర్ కామెంట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..