Viral: చదివిన తర్వాత చింపెయ్.. 47 ఏళ్ల వయస్సులో విద్యార్థినికి లవ్‌ లెటర్‌ రాసిన టీచర్.. అందులో ఏముందంటే..

|

Jan 08, 2023 | 6:09 AM

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. తాను ఉపాధ్యాయుడినని మర్చిపోయి.. 47 వయస్సులో 13 ఏళ్ల అమ్మాయికి ప్రేమ లేఖ రాసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. పిల్లలను సక్రమ మార్గంలో నడిపిస్తూ.. వారేదైనా తప్పు చేస్తే మందలించాల్సిన ఉపాధ్యాయుడే....

Viral: చదివిన తర్వాత చింపెయ్.. 47 ఏళ్ల వయస్సులో విద్యార్థినికి లవ్‌ లెటర్‌ రాసిన టీచర్.. అందులో ఏముందంటే..
Love Letter
Follow us on

Viral News: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. తాను ఉపాధ్యాయుడినని మర్చిపోయి.. 47 వయస్సులో 13 ఏళ్ల అమ్మాయికి ప్రేమ లేఖ రాసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. పిల్లలను సక్రమ మార్గంలో నడిపిస్తూ.. వారేదైనా తప్పు చేస్తే మందలించాల్సిన ఉపాధ్యాయుడే.. ఓ విద్యార్థికి ప్రేమ లేఖ రాశాడు. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తాను అంటూ ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ కు చెందిన స్కూల్ టీచర్ 8వ తరగతి అమ్మాయికి లవ్‌ లెటర్‌ రాశాడు. 47 ఏళ్ల టీచర్, 8వ తరగతి అమ్మాయికి రాసిన లేఖలో, తాను ఆమెను ప్రేమిస్తున్నానని, శీతాకాలపు సెలవుల్లో ఆమెను మిస్‌ అవుతున్నానని రాశాడు. కన్నౌజ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న బాలికకు ప్రేమలేఖ ఇచ్చి ఆ లేఖ గురించి ఎవరికీ చెప్పవద్దని కోరాడు. పాఠశాలకు శీతాకాల సెలవులకు ముందు గత ఏడాది డిసెంబర్‌ 30వ తేదీన ఉపాధ్యాయుడు మైనర్‌కు లేఖ ఇచ్చాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న లేఖలో, తాను 8వ తరగతి అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నానని, శీతాకాలపు సెలవుల్లో ఆమెను మిస్ అవుతానని రాశాడు. వీలున్నప్పుడు తనకు ఫోన్ చేయాలని కూడా లేఖలో కోరాడు.

విద్యార్థిని ఈ లేఖ గురించి ఇంట్లో చెప్పడంతో 47 ఏళ్ల ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బాలిక కుటుంబ సభ్యులు సదర్ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కన్నౌజ్ ఎస్పీ కున్వర్ అనుపమ్ సింగ్ మాట్లాడుతూ, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని, రాష్ట్ర విద్యాశాఖ విచారణ జరిపి నివేదికను తమకు అందజేయాల్సి ఉందన్నారు. లేఖలోని చేతి రాతను ఉపాధ్యాయుడి చేతితో సరిపోల్చాలని తాము పోలీసులను అభ్యర్థించామని విద్యాశాఖ అధికారి కౌస్తుభ్ సింగ్‌ పేర్కొన్నారు. దోషిగా తేలితే ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..