Scary Ice Cream: జింగ్ జింగ్.. అమేజింగ్.. ఈ ఐస్ క్రీం చూస్తే.. మీ పిల్లలు ఇక కావాలని అడగరే అడగరు..

|

Apr 03, 2024 | 11:36 AM

ఐస్ క్రీం షాప్ కనిపిస్తే చాలు.. వెంటనే పిల్లలు తమకు ఐస్ క్రీం కావాలని పట్టుబట్టడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఐస్‌క్రీమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే పిల్లలు ఐస్‌క్రీమ్స్ అంటూ మారం చేస్తుంటే వైరల్ అవుతున్న ఒక ఐస్ క్రీమ్ ని చూపిస్తే చాలు ఖచ్చితంగా భయపడతారు. అంతేకాదు మళ్ళీ ఎప్పుడూ ఐస్ క్రీమ్ కొనివ్వమని అడగరు కూడా..

Scary Ice Cream: జింగ్ జింగ్.. అమేజింగ్.. ఈ ఐస్ క్రీం చూస్తే.. మీ పిల్లలు ఇక కావాలని అడగరే అడగరు..
Scary Ice Cream
Follow us on

ఐస్ క్రీం పాలు లేదా క్రీమ్‌తో తయారు చేయబడిన ఘనీభవించిన డెజర్ట్. ప్రపంచ వ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ఇష్టంగా తినే ఆహారం. అయితే వేసవి కాలం వస్తే చాలు అందరి చూపు ఐస్ క్రీం దుకాణాల వైపే.. తీవ్రమైన ఎండ, వేడి వలన కలిగే అలసట నుంచి ఉపశనం కోసం ఐస్ క్రీమ్ ను తినడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం ఐస్ క్రీమ్ ఆహార అంతర్భాగంలో ఒకటిగా మారింది. ఐస్ క్రీం శరీరాన్ని చల్లగా ఉంచుతుందని.. దీన్ని తినడం వల్ల వేడిలో ఉపశమనం లభిస్తుందని ఎక్కువ మంది భావిస్తారు. అందుకనే ఇష్టమైన స్వీట్లు , డెజర్ట్‌ల విషయానికి వస్తే రకరకాల ఐస్ క్రీమ్స్ ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తాయి.

ఐస్ క్రీం షాప్ కనిపిస్తే చాలు.. వెంటనే పిల్లలు తమకు ఐస్ క్రీం కావాలని పట్టుబట్టడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఐస్‌క్రీమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే పిల్లలు ఐస్‌క్రీమ్స్ అంటూ మారం చేస్తుంటే వైరల్ అవుతున్న ఒక ఐస్ క్రీమ్ ని చూపిస్తే చాలు ఖచ్చితంగా భయపడతారు. అంతేకాదు మళ్ళీ ఎప్పుడూ ఐస్ క్రీమ్ కొనివ్వమని అడగరు కూడా..

ఇవి కూడా చదవండి

ఈ వింత ఐస్ క్రీం వీడియో @creepycum ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. మార్చి 12న షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 15 మిలియన్లకు పైగా అంటే 1.5 కోట్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 3,15,806 మంది వీడియోను లైక్ చేశారు.

భయంకరమైన ఐస్ క్రీమ్ వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ఈ వీడియో అన్నిచోట్లా వైరల్ కావడంతో వేల మంది కామెంట్స్ ద్వారా స్పందిస్తున్నారు. ‘ఈ దృశ్యం చాలా భయానకంగా ఉంది’ అని ఒక వినియోగదారు రాస్తే, ‘ఈ ఐస్‌క్రీం చూసిన తర్వాత పిల్లలు ఐస్‌క్రీం తినాలని అనుకోరు అని కొనరు అంటే.. ఐస్ క్రీమ్ తినడం మానరు అంటూ మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..