Viral: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన మొసలి కళేబరం.. పొట్ట ఎక్స్‌రే తీయగా

పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతుండగా.. వారికి ఓ మొసలి కళేబరం దొరికింది. అది సుమారు ౩ వేల ఏళ్ల నాటి పురాతన మొసలి కళేబరం.. ఆ తర్వాత దాని పొట్ట ఎక్స్ రే తీయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా..

Viral: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన మొసలి కళేబరం.. పొట్ట ఎక్స్‌రే తీయగా
Viral News

Updated on: Sep 12, 2025 | 7:41 PM

మొసలిని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తారు. వాటికి నీటిలో అసాధారణమైన శక్తీ ఉంటుంది. ఎంతటి భారీ కాయమున్న జంతువులనైనా అమాంతం మట్టుబెడతాయి. అలాంటిది మనం ఈడేటప్పుడు మొసలి మన పక్కకి వస్తే ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. అయితే ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు ౩ వేల ఏళ్ల నాటి ఓ పురాతన మమ్మీఫైడ్ మొసలిని బయటకు తీశారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

సాధారణంగా ఈజిప్ట్‌లో తమ కుటుంబానికి చెందిన వారెవరైనా చనిపోతే.. వాళ్ల మృతదేహాలను మమ్మీఫికేషన్ ద్వారా సంరక్షిస్తారు. ఒక్క మనుషులకు మాత్రమే కాదు ఈ ఆచారం.. జంతువులకు కూడా వర్తిస్తుంది. వాళ్ల ఆచారాల ప్రకారం.. ఇలా చేసి దేవుళ్లకు నైవేద్యాలుగా ఉంచుతారట. ఇదిలా ఉంటే.. ఇటీవల పురావస్తు అధికారులకు సుమారు 3 వేల ఏళ్ల నాటి మమ్మీఫైడ్ మొసలిని బయటకు తీశారు. దాదాపుగా 7.2 అడుగుల పొడవున్న ఈ మమ్మీఫైడ్ మొసలి కళేబరంపై మాంచెస్టర్ యూనివర్సిటీ అధికారులు పలు పరిశోధనలు జరిపారు.

దీనిని స్పెసిమెన్ 2005.335 అని పిలుస్తారట. దాని పొట్ట ఎక్స్‌రే తీయగా.. మొసలి కడుపులో ఎముకలతో పాటు గ్యాస్ట్రోలిత్‌లు, రాళ్లు, కాంస్యపు చేపల హుక్‌ను గుర్తించారు. వాటితో పాటు ఎరగా ఉపయోగించే చేప అవశేషాలు కూడా మొసలి కడుపులో ఉన్నాయి. ఇక ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌‌లో వైరల్ అవుతోంది.