Viral News: ఆకాశంలో అప్పుడప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్నింటిన్ని స్వయంగా చూడగలుగుతాం.. కొన్నింటిన్ని తమ కెమెరాల్లో బంధించి ఎవరైనా చూపిస్తే చూస్తాం..ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈవీడియో అలాంటిదే. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సౌదీ అరేబియాలోని మక్కాలో క్లాక్ టవర్‌పై పిడుగు పడిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా మెరుపులు రావడం, ఆ తర్వాత ఆకాశమంతా వెలుగులు విరజిమ్మడం ఈవీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి అయిన ముల్హమ్ అనే యువకుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈవీడియో చూస్తున్న వారంతా ఆశ్చర్చపోతున్నారు. ఇప్పటివరకు ఈవీడియోను దాదాపు ఇప్పటివరకూ 15 లక్షల మందికి పైగా వీక్షించారు.
قبل قليل صاعقة تضرب #برج_الساعة مع #أمطار_مكة جعلها الله صيبا نافعا للبلاد والعباد #مكه_الان pic.twitter.com/y9ZziH2dn3
ఇవి కూడా చదవండి— الفلكي مُلهَم هندي (@MulhamH) August 4, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..