Viral Video: ఇంజిన్, డ్రైవర్ లేకుండా కదులుతున్న రైలు భోగీలు.. నెట్టింట్లో వీడియో వైరల్..

|

Sep 05, 2023 | 5:38 PM

ఇంజన్ లేకుండానే ట్రాక్‌పై రైలు బోగీ నడుస్తుండటం వైరల్‌గా మారిన వీడియోలో కనిపిస్తోంది. ఇంజిన్ లేకుండానే ట్రాక్‌పై బోగీలు నడపడం కలకలం సృష్టించింది. ఈ సమయంలో ప్రజలు పరుగులు తీయడం కనిపించింది. సమాచారం మేరకు ట్రాక్‌పై గూడ్స్ రైలు పెట్టె నిలబడి ఉంది. అదే ట్రాక్‌పై మెయింటెనెన్స్ కోసం నిలబడి ఉన్న నాలుగు బోగీలను ఢీకొట్టడంతో బోగీలు ట్రాక్‌పై పరుగులు తీయడం ప్రారంభించాయి.

Viral Video: ఇంజిన్, డ్రైవర్ లేకుండా కదులుతున్న రైలు భోగీలు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Train Ran Without Engine
Follow us on

ఇంజిన్, డ్రైవర్ లేకుండా రైలు భోగీలు అకస్మాత్తుగా కదలడం మీరు ఎప్పుడైనా చూశారా లేదా విన్నారా? ఇలాంటి షాకింగ్ ఘటన జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌లో తెరపైకి వచ్చింది. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించవచ్చు కానీ నిజంగా చోటు చేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇంజన్ లేకుండానే ట్రాక్‌పై రైలు బోగీ నడుస్తుండటం వైరల్‌గా మారిన వీడియోలో కనిపిస్తోంది. ఇంజిన్ లేకుండానే ట్రాక్‌పై బోగీలు నడపడం కలకలం సృష్టించింది. ఈ సమయంలో ప్రజలు పరుగులు తీయడం కనిపించింది. సమాచారం మేరకు ట్రాక్‌పై గూడ్స్ రైలు పెట్టె నిలబడి ఉంది. అదే ట్రాక్‌పై మెయింటెనెన్స్ కోసం నిలబడి ఉన్న నాలుగు బోగీలను ఢీకొట్టడంతో బోగీలు ట్రాక్‌పై పరుగులు తీయడం ప్రారంభించాయి. ఇది చూసిన జనంలో కలకలం రేగింది. ఈ ఘటనపై ఇప్పటి వరకు రైల్వే అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ విషయంపై విచారణ జరుగుతోందిని చెప్పారు.

సాహెబ్‌గంజ్‌లోని మాల్దా రైల్ డివిజన్ పరిధిలోని బర్హర్వా రైల్వే స్టేషన్‌లో రైలు ఇంజన్ లేకుండా నడుస్తోంది. డిగ్గీ ప్రధాన రహదారి మీదుగా బిందుధామ్ వరకు రేక్ లోడింగ్ కోసం లైన్ వేశారు. రైల్వే శాఖ నిర్లక్ష్యం కారణంగా అకస్మాత్తుగా అదే రైలు మార్గంలో ఇంజిన్ లేకుండా ఒక రైలు పరుగెత్తడం ప్రారంభించింది. అయితే పెను ప్రమాదం తప్పిడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

తప్పిన పెను ప్రమాదం

డిగ్గీ ప్రధాన మార్గంలో చాలా ఏళ్లుగా రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ రైల్వే గేటు లేదు. దిగ్గీ రైల్వే ప్రధాన రహదారిపై గేటు ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడి ప్రజలు కోరుతున్నా నేటికీ ఆ పనులు జరగలేదు. ఇంతలో ర్యాక్ లోడింగ్ వైపు నుండి ఇంజిన్ లేకుండా రైలు ట్రాక్‌పై నడుస్తున్న షాకింగ్ వీడియో  వెలుగులోకి వచ్చింది. ఈ సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై అప్పటికే ప్యాసింజర్ రైలు నిలబడి ఉన్నా..  లేదా అదే సమయంలో రైలు వచ్చి ఉంటే.. అక్కడ జరిగే ప్రమాదం ఊహకు కూడా అందదు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తలచుకుంటేనే భయంగా ఉందని అంటున్నారు.

ఈ ఆకస్మికంగా ఇంజన్ లేకుండానే రైలు బోగీలు పరుగులు పెట్టడంతో కలకలం రేగింది. ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో  ప్రజలు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. డిగ్గీ రైల్వే ప్రధాన రహదారిపై గేటును కూడా త్వరగా నిర్మించాలని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..