Russian Bodybuilder: ఇవి ఒరిజినల్ బైసెప్స్ కావు.. అతిగా ఆలోచించాడు.. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు

|

Mar 06, 2021 | 12:56 PM

ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని కలలు కంటారు. ఫిట్ బాడీని కోరుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు.  కానీ కొన్నిసార్లు ఈ కోరిక  సమస్యగా మారుతుంది.

Russian Bodybuilder: ఇవి ఒరిజినల్ బైసెప్స్ కావు.. అతిగా ఆలోచించాడు.. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు
Follow us on

Russian Bodybuilder:  ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని కలలు కంటారు. ఫిట్ బాడీని కోరుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు.  కానీ కొన్నిసార్లు ఈ కోరిక సమస్యగా మారుతుంది. డైట్ ఫాలో అయ్యి వ్యాయామం చేయడం వరకు ఓకే. కానీ కొందరు షార్ట్ కట్స్ కోరుకుంటున్నారు. ఇవి లేనిపోని సమస్యలను సృష్టిస్తున్నాయి రష్యాలో నివసిస్తున్న 24 ఏళ్ల బాడీబిల్డర్ కిరిల్ తెరెసిన్ విషయంలో ఇలాంటిదే జరిగింది. పెట్రోలియం జెల్లీ ఇంజెక్షన్  ఉపయోగించి తనను తాను సూపర్‌మ్యాన్‌గా మార్చుకోడానికి అతను ట్రై చేశాడు. ఈ క్రమంలో కిరిల్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తున్నాడు.

 కిరిల్‌కి ఇప్పుడు తన భవిష్యత్తుపైనే బెంగ పట్టుకుంది. తాను ఎంత తెలివితక్కువగా చేశాడో కూడా తెలుసుకున్నాడు. ఇతను తనకు 20 ఏళ్ళ  వయసు ఉన్నప్పటి నుంచి పెట్రోల్ జెల్లీని ఇంజెక్ట్ చేయడం ప్రారంభించానని చెప్పాడు. తన శరీరంలోని మిగిలిన భాగాలలో జెల్లీని పూయాలని తొలుత అనుకున్నాడట. అయితే  దాని ప్రభావాన్ని మొదట మజిల్స్‌పై చూద్దామనుకున్నాడట. ఈ క్రమంలో తొలుత తన హ్యాండ్స్‌కు జెల్లీ ఇంజెక్షన్ ఇచ్చాడు. వెంటనే అతడి చేతుల్లో సమస్య మొదలైంది. అప్పుడే తన శరీరంలోని మిగిలిన భాగాలలో సదరు ఇంజెక్షన్ ఉపయోగించకూడదని తాను గ్రహించినట్టు కిరిల్ చెప్పాడు. కాగా అతడి మజిల్స్ ఊహించని విధంగా ఉబ్బిపోయాయి. దీంతో అతడు డాక్టర్లను సంప్రదించాడు. కిరిల్‌కు ప్రస్తుతం చికిత్స  కొనసాగుతుంది. 

గత ఏడాది ఆపరేషన్ జరిగింది. అప్పుడు అతని కండరాల నుంచి చమురుతో పాటు చనిపోయిన కణజాలాలను తీసివేశారు.  పెట్రోలియం జెల్లీ వాడటం వల్ల చేతుల్లో నొప్పి ప్రారంభమైంది, వెంటనే జ్వరం రావడం ప్రారంభమైంది కిరిల్ చెప్పాడు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు పెరిగాయని..  శస్త్రచికిత్స చేయకపోతే చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు. చాలా మంది తనలాంటి ఆలోచనలే కలిగి ఉంటారని.. కానీ అది కరెక్ట్ కాదని అందరకీ అప్పీల్ చేస్తున్నాడు. ఇలాంటి వాటిని దయచేసి ఎవరూ అనుకరించవద్దని అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు. 

Also Read:

Viral News Telangana: తాళి కట్టు శుభవేళ.. పురోహితుడు మిస్సింగ్.. దీంతో ఏం చేశారంటే..?

ఈ పంట వేస్తే.. సిరుల పంట.. 1 ఎకరంలో సాగు చేస్తే 30 కోట్లు… సాగు విధానం సహా పూర్తి వివరాలు