Video: రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కే ప్రయత్నం.. దేవుడిలా వచ్చిన RPF కానిస్టేబుల్! కాస్త తేడా జరిగినా..

ఈరోడ్ జంక్షన్ వద్ద కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో ఓ మహిళ జారిపడింది. సమయస్ఫూర్తితో స్పందించిన RPF హెడ్ కానిస్టేబుల్ జగదీశన్ ఆమెను పట్టాలపై పడకుండా పట్టుకుని ప్రాణాలు కాపాడారు. ఈ దృశ్యం సీసీటీవీలో రికార్డ్ అయింది. మహిళ పట్ల కానిస్టేబుల్ చూపిన ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసించారు.

Video: రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కే ప్రయత్నం.. దేవుడిలా వచ్చిన RPF కానిస్టేబుల్! కాస్త తేడా జరిగినా..
Erode Train Incident

Updated on: Oct 29, 2025 | 7:02 PM

తమిళనాడులోని ఈరోడ్ జంక్షన్ వద్ద ఒక మహిళ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారిపడిపోయింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ సమయానికి స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. రైలు వెళ్లిపోతుందనే కంగారులో ఆ మహిళ ప్రమాదకరంగా రైలు ఎక్కే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పట్టుజారి రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య పడిపోతుండగా రైల్వే కానిస్టేబుల్‌ ఒక్కసారిగా పైకి లాగడంతో ప్రమాదం తప్పింది. ఈ దృశ్యం సీసీటీవీలో రికార్డ్‌ అయింది. సీసీటీవీ ఫుటేజ్‌ను దక్షిణ రైల్వే ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

ఈ సంఘటన 2025 అక్టోబర్ 27న ఈరోడ్ స్టేషన్‌లో జరిగింది. చెన్నైకి వెళ్లే రైలు నంబర్ 22650 యెర్కాడ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ఆ మహిళ బ్యాలెన్స్ కోల్పోయి ప్లాట్‌ఫారమ్, కదులుతున్న రైలు మధ్య జారిపోయింది. ఒక్క క్షణంలో దక్షిణ రైల్వే పరిధిలోని కరూర్‌లో పోస్ట్ చేయబడిన RPF హెడ్ కానిస్టేబుల్ జగదీశన్ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చేయి పట్టుకుని, ఆమె పట్టాలపై పడకముందే ఆమెను సురక్షితంగా లాగాడు. ఈ వీడియో అక్టోబర్ 28, 2025న షేర్ అయింది. నెటిజన్లు RPF కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి