Watch Video: యువకుడితో రైల్వే కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన.. సస్పెండ్ చేయాలంటూ మండిపడుతున్న నెటిజన్లు..

|

Jul 05, 2023 | 6:08 PM

Railway Level Crossing: రైల్వే గేట్ క్రాసింగ్‌ను దాటుతుండగా ప్రమాదం జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే రైల్వే లైన్లను క్రాస్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు పదే పదే ప్రజలను కోరుతుంటారు. వారు ఎంతగా చెప్పినా రైల్వే గేట్ క్రాసింగ్‌ల..

Watch Video: యువకుడితో రైల్వే కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన.. సస్పెండ్ చేయాలంటూ మండిపడుతున్న నెటిజన్లు..
Viral Video Visuals
Follow us on

Railway Level Crossing: రైల్వే గేట్ క్రాసింగ్‌ను దాటుతుండగా ప్రమాదం జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే రైల్వే లైన్లను క్రాస్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు పదే పదే ప్రజలను కోరుతుంటారు. వారు ఎంతగా చెప్పినా రైల్వే గేట్ క్రాసింగ్‌ల వద్ద గేటు వేసినా.. దాని కిందగా వెళ్లి ప్రమాదాలను కొని తెెచ్చుకునేవారు కూడా లేకపోలేదు. అలా చేయడం మనకే ప్రమాదం అని తెలిసినా పెడచెవిన పెడుతుంటారు. అయితే అలా దాటుతున్న వ్యక్తిని ఓ రైల్వే పోలీస్ ఆధికారి అడ్డుకుని మంచి పనే చేశాడు. కానీ అతనిపై చేయి చేసుకుని, అతని బైక్‌ని కాలితో తంతూ హద్దు దాటాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో మీరు ఓ యువకుడు రైల్వే గేట్‌ కిందగా తన బైక్‌ని పట్టాల అవతల వైపుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడాన్ని మీరు చూడవచ్చు. అంతలోనే అక్కడకు వచ్చిన ఓ అధికారి అతన్ని వారించడం, ఆపై చెంపదెబ్బ కొట్టడం, ఇంకా రెచ్చిపోయి యువకుడి బైక్‌ని పదేపదే కాలితో తన్నడాన్ని మీరు గమనించవచ్చు. అలా చేయడంతో ఆ యువకుడు తన బైక్‌ని గేట్ వెనక్కి తీసుకువెళ్లడాన్ని కూడా మీరు వీక్షించవచ్చు. ఇదిలా ఉండగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు అధికారిపై మండిపడుతున్నారు. ఇంకా వీడియోలోని యువకుడి బైక్ నంబర్ ఆధారంగా ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగి ఉండవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆ ‘యువకుడు తప్పు చేశాడు కానీ అతన్ని కొట్టే అధికారం ఆ పోలీస్‌కి ఎవరు ఇచ్చారు..?’, ‘చెంప దెబ్బ ఎందుకు కొట్టాడు.. అతనిపైనే అసలు యాక్షన్ తీసుకోవాలి’, ‘ఆ పోలీస్‌ని సస్పెండ్ చేయాలి’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. ఇదే తరహాలో కొందరు స్పందిస్తుండగా.. బైకర్ తప్పు చేశాడని మరికొందరు అంటున్నారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షా 21 వేల వీక్షణలు లభించాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..