Viral: బ్రోకలి వండుకుందామని కవర్ తెరిచాడు.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూడగా.!

ప్రతీ రోజూ మాదిరిగానే ఆ వృద్దుడు తన ఇంటికి దగ్గరలోని సూపర్ మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనుక్కుని తెచ్చాడు. అనంతరం బ్రోకలీని వండుకుందామని..

Viral: బ్రోకలి వండుకుందామని కవర్ తెరిచాడు.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూడగా.!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 05, 2023 | 5:57 PM

ప్రతీ రోజూ మాదిరిగానే ఆ వృద్దుడు తన ఇంటికి దగ్గరలోని సూపర్ మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనుక్కుని తెచ్చాడు. అనంతరం బ్రోకలీని వండుదామని.. దాని కవర్ ఓపెన్ చేశాడు. అంతే! ఎదురుగా కనిపించిన సీన్ చూసి దెబ్బకు బెంబేలెత్తిపోయాడు. ఇంతకీ అతడికేం కనిపించింది.? ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందామా.!

వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌కు చెందిన 63 ఏళ్ల నెవిల్లె లింటన్ అనే వృద్దుడు తన స్థానిక సూపర్ మార్కెట్ నుంచి ఇంటికి కావాల్సిన కూరగాయలను తెచ్చాడు. అనంతరం వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అనంతరం ఆ సాయంత్రం బ్రోకలీ వండేందుకు దాన్ని ఫ్రిడ్జ్‌లో నుంచి బయటకి తీసి.. దాని కవర్ ఓపెన్ చేయగా.. ఎదురుగా కనిపించిన సీన్ చూసి దెబ్బకు అతడి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ బ్రోకలీ మధ్యలో ఓ పాము ఎంచక్కా సేద తీరుతూ దర్శనమిచ్చింది.

ఆ తర్వాత జరిగిన విషయాన్ని అతడి చెల్లెలికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. ఆమె ఇచ్చిన సలహా మేరకు బ్రోకలీని జాగ్రత్తగా ప్యాక్ చేసి.. దాన్ని కొనుగోలు చేసిన సూపర్ మార్కెట్‌కి తీసుకెళ్లాడు. ‘ఇందులో పాము ఉందని.. ఆ దుకాణదారుడికి చెప్పాడు’.. దానికి అతడు నవ్వి ఊరుకున్నాడు. అయితే ఆ తర్వాత బ్రోకలీలో ఉన్న పామును తెగ భయపడిపోయాడు. కాగా, ఆ పాము పెద్ద ప్రమాదకరం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై కూరగాయలు కొనే ముందు ఒకటికి రెండుసార్లు చూసుకుంటానని బ్రోకలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నెటిజన్లతో పంచుకున్నాడు ఆ వృద్దుడు.(Source)