Watch: ఇలా ఉన్నారేంట్రా.. ! బైక్‌ దొరికితే చాలు రోడ్డంతా మామ ఆస్తైనట్టుగా చెలరేగిపోతారు..

|

Aug 26, 2024 | 11:21 AM

ఇలాంటి బాధ్యత లేని వ్యక్తులు చేసే తప్పిదాలే ప్రమాదాలకు కారణమవుతున్నారని మండిపడుతున్నారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చాలా మంది నెటిజన్లు వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలకు సంబంధించిన పలు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాలను బలిగొంటాయని ఆ వీడియో చూపిస్తోంది.

Watch: ఇలా ఉన్నారేంట్రా.. ! బైక్‌ దొరికితే చాలు రోడ్డంతా మామ ఆస్తైనట్టుగా చెలరేగిపోతారు..
Road Accident
Follow us on

నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు హృదయాన్ని కదిలించేవిగా ఉంటాయి. కొన్ని వీడియోలు ఒళ్లు గగ్గొర్పేడిచేలా ఉంటాయి. వాహనదారులు చేసే చిన్న పొరపాటు ప్రమాదానికి దారి తీస్తుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఒక బైకర్‌ చేసిన నిర్లక్ష్యం ఎంత ప్రమాదానికి దారితీసేలా ఉందో ఈ వీడియో చూపిస్తుంది. వీడియో చూసి మీరు కూడా షాక్‌ అవుతారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ వైరల్ వీడియోలో ఒక హైవేపై వాహనాల రాకపోకలు కనిపిస్తున్నాయి. ఇంతలోనే ఒక బైకర్ రాంగ్‌ రూట్లో రోడ్డు దాటడం కనిపిస్తుంది. వాహనాల రద్దీ కొనసాగుతున్న క్రమంలోనే అతడు బైక్‌ను రోడ్డు దాటించే ప్రయత్నం చేశాడు. ఎదురుగా వేగంగా వస్తున్న వాహనాలను చూసి కూడా ఏ మాత్రం భయం లేకుండా రోడ్డు క్రాస్‌ చేసే ప్రయత్నం చేశాడు. అంతలోనే స్పీడ్‌గా వచ్చిన ఒక కారు అతన్ని దాదాపుగా ఢీకొట్టినంత దగ్గర వచ్చి ఆగిపోయింది. కారు డ్రైవర్‌ చాకచక్యంతో వెంటనే బ్రేకులు వేయటం వల్లే వేగంగా వచ్చిన కారు ఆగిపోయింది. ఆ మరుక్షణంలోనే మరో లారీ, ఓ ట్రక్కు కూడా అంతేవేగంతో వచ్చి కారుకు కాస్త దూరంలో ఆగిపోయాయి. దీంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్యాప్షన్‌లో ఇలాంటి బుద్ధిహీనుల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి అని రాసి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి..

ఈ వీడియో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయబడింది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోకు ప్రతిస్పందించారు. ఒకరు దీనిపై స్పందిస్తూ.. ఎవరో ఒక్కరి కారణంగా మరొకరి జీవితం బలవుతుందని రాశారు. ఆ కారులోని సాంకేతికత, డ్రైవర్ల సమయపాలనా కారణంగానే ఇక్కడ ప్రమాదం తప్పిందని, ఇలాంటి బాధ్యత లేని వ్యక్తులు చేసే తప్పిదాలే ప్రమాదాలకు కారణమవుతున్నారని మండిపడుతున్నారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చాలా మంది నెటిజన్లు వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలకు సంబంధించిన పలు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాలను బలిగొంటాయని ఆ వీడియో చూపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..