Viral Video: స్కూటీ మీద వెళుతున్న ఇద్దరు.. ఇంతలో కొండపై నుంచి పడ్డ భారీ రాళ్ళు.. తరువాత ఏం జరిగిందో మీరే చూడండి!

|

Sep 07, 2021 | 9:40 AM

మీరు మీ బైక్ తో కొండదారిలో వెళుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కొండమీద నుంచి బండరాళ్ళు దొర్లుకుంటూ వచ్చి రోడ్డుమీద పడ్డాయి.

Viral Video: స్కూటీ మీద వెళుతున్న ఇద్దరు.. ఇంతలో కొండపై నుంచి పడ్డ భారీ రాళ్ళు.. తరువాత ఏం జరిగిందో మీరే చూడండి!
Viral Video Uttarakhand
Follow us on

Viral Video: మీరు మీ బైక్ తో కొండదారిలో వెళుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కొండమీద నుంచి బండరాళ్ళు దొర్లుకుంటూ వచ్చి రోడ్డుమీద పడ్డాయి. త్రుటిలో మీరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. అప్పుడు మీకెలా అనిపిస్తుంది? అదేమో కానీ.. ఆ దృశ్యం చూసేవారికి మాత్రం ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇటువంటి సంఘటన మనం చెప్పుకుంటేనే వామ్మో అనిపిస్తుంటే.. అక్కడ ఉన్నవారి పరిస్థితి తలుచుకుంటే మాత్రం పాపం అనిపిస్తుంది. కానీ, ఇటువంటి పరిస్థితిలోనూ చూసేవారిలో కొందరు ఇటువంటి దృశ్యాలను వీడియోలు లేదా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేమిటంటే..

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో సోమవారం రోడ్డుపై పెద్ద రాళ్లు అకస్మాత్తుగా పడటం ప్రారంభించాయి. అదే సమయంలో, ఇద్దరు యువకులు ఆ రోడ్డు పై స్కూటీ మీద వస్తున్నారు. అదృష్టవశాత్తూ, శిథిలాల బారి నుంచి వారు తృటిలో తప్పించుకున్నారు. అంతకుముందు సోమవారం, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఇదేవిధంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఇక్కడ మీరూ చూసేయండి..

ఈ సంఘటన నాగ్ని పెట్రోల్ పంప్ సమీపంలో జరిగింది.

ఈ సంఘటన చంబాకు 15 కి.మీ ముందు రిషికేష్-గంగోత్రి జాతీయ రహదారిపై నాగ్ని పెట్రోల్ పంపు దగ్గర జరిగింది. భారీ బండరాళ్లు, కొండపై నుంచి రాళ్లు పడడంతో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హైవే మూసివేశారు. దీని కారణంగా దానికి ఇరువైపులా వాహనాల క్యూలు నిలిచిపోయాయి. విద్యుత్, నీటి లైన్లతో పాటు, జడ్ధార్ గ్రామానికి వెళ్లే రహదారి, ప్రధాన ద్వారం కూడా భారీ బండరాయి పడడంతో ధ్వంసమయ్యాయి.

హిమాచల్‌లో కూడా ఈ ఘటన వెలుగు చూసింది ఈ కారణంగా ఇక్కడ జాతీయ రహదారి బ్లాక్ చేయబడింది. రాంపూర్ జ్యోరీలో పర్వతం విరిగి హైవేపై పడింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ సంఘటన జరగడానికి ముందుగానే జిల్లా యంత్రాంగం ఈ ప్రాంతంలో హెచ్చరిక జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసు సిబ్బందిని కూడా మోహరించారు. దీని కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది.
ఇక్కడ మీరు ఉత్తరాఖండ్ ఘటనకు సంబంధించి ఒకరు చేసిన ట్వీట్ కూడా చూడొచ్చు.

Also Read: భారత్ లో అనూహ్యంగా పెరుగుతున్న కిడ్నీ సమస్య..! సమస్యను గుర్తించడం ఎలా..?(వీడియో): Kidney Problem

Heavy Rains Updates Video: భారీ నుండి అతి భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. లైవ్ వీడియో.