Viral Video: వధూవరులు దండలు మార్చుకుంటుండగా.. సడెన్‌గా వధువు మాజీ ప్రేమికుడు ఎంట్రీ.. సినిమాకు తగ్గని సీన్‌‌తో అతిథులకు షాక్

|

Dec 06, 2021 | 9:43 PM

Viral Video: నిజ జీవితంలోని జరిగే కొన్ని సంఘటనలు కొన్నిసార్లు సినిమాల్లోని సీన్స్‌సి తలపిస్తాయి. అందుకు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఈ వింత వివాహం ఉదాహరణగా..

Viral Video: వధూవరులు దండలు మార్చుకుంటుండగా.. సడెన్‌గా వధువు మాజీ ప్రేమికుడు ఎంట్రీ.. సినిమాకు తగ్గని సీన్‌‌తో అతిథులకు షాక్
Viral Video
Follow us on

Viral Video: నిజ జీవితంలోని జరిగే కొన్ని సంఘటనలు కొన్నిసార్లు సినిమాల్లోని సీన్స్‌సి తలపిస్తాయి. అందుకు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఈ వింత వివాహం ఉదాహరణగా నిలుస్తుంది. వివాహ సమయంలో.. వధూవరులు దండలు మార్చుకోబోతున్నారు. ఇంతలో.. హఠాత్తుగా వధువు మాజీ ప్రేమికుడు వేదిక వద్దకు వచ్చాడు.. సినిమాలోని హీరో స్టైల్‌లో ఆ ప్రేమికుడు వధువుని పెళ్లిచేసుకోవడానికి యత్నించాడు. ఇదంతా.. వివాహానికి హాజరైన ఎవరో రికార్డ్ చేశారు.. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్లే..

గోరఖ్‌పూర్‌లోని హర్‌పూర్‌లో బంధు మిత్రుల సమక్షంలో వివాహా వేడుక జరుగుతోంది. వేదికపై బంధువులు వధూవరుల పెళ్లి వేడుకను చూస్తున్నారు. వివాహ తంతు జరుగున్న సమయంలో వధువువరులు దండాలు మార్చుకోవడానికి రెడీ అయ్యారు. ఇంతలో కండువా కప్పుకుని ఉన్న యువకుడు పెళ్లి వేదిక వద్దకు ఎంటర్ అయ్యి.. వధువు నుదుటి మీద బొట్టుని పెట్టడానికి ప్రయత్నించాడు. అప్పుడు వధువు తన ముఖాన్ని పరదాతో కప్పుకోవడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ యువకుడు వధువు నుదిటి మీద బలవంతంగా సిందూర్‌ దిద్దాడు, ఇదంతా అక్కడ పెళ్ళికి హాజరైన ఎవరో వీడియో తీశారు.

అయితే అలా పెళ్లి మండపానికి వచ్చిన యువకుడు వధువు మాజీ ప్రేమికుడని తెలిసింది. ఆ యువకుడు కొన్ని నెలల క్రితం పని నిమిత్తం ఊరు బయటకు వెళ్లాడని తెలుస్తోంది. ఈలోగా అమ్మాయి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లిని నిశ్చయించారు.  పెళ్లి విషయం తెలుసుకున్న మాజీ ప్రేమికుడు తన ప్రేమను సినిమా స్టైల్ లో  అందరికీ చెప్పాలని నిర్ణయించుకుని ఇలా పెళ్లి పందిరిలో హంగామా సృష్టించాడు.  పెళ్ళికి వచ్చిన బంధువులు యువకుడిని చితకబాది.. పోలీసులకు ఫోన్ చేశారు. ఈ ఘటన డిసెంబర్ 1న జరిగింది.

సంఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం, అమ్మాయికి పెద్దలు కుదిర్చిన వరుడితోనే వివాహం జరిగింది.  పెళ్లి జరిగిన అనంతరం మాజీ ప్రేమికుడిని ఇంటికి పంపించారు బంధువు..

Also Read:  ఆర్ధిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా.. మార్గశిరంలో గురువారం లక్ష్మీదేవిని ఇలా పూజించండి..