Viral Video: అరేయ్.. ఏంట్రా ఇది.. ఆర్‌సీబీ గెలిచిందని రోడ్డుపైనే కానిచ్చారు..

ఆర్సీబీ ఫ్యాన్స్17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

Viral Video: అరేయ్.. ఏంట్రా ఇది.. ఆర్‌సీబీ గెలిచిందని రోడ్డుపైనే కానిచ్చారు..
Viral Video

Updated on: Jun 04, 2025 | 1:18 PM

ఆర్సీబీ ఫ్యాన్స్17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. దీంతో కోట్లాది మంది ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా.. అభిమానులు క్రాకర్లు పేల్చి, నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కానీ.. ఈ ప్రేమికుల జంట మాత్రం హద్దు దాటారు.. ఏకంగా రోడ్డు పైనే రచ్చ రచ్చ చేశారు. ఆర్సీబీ గెలిచిన ఆనందంలో బహిరంగంగా పరస్పరం కిస్ గిఫ్ట్ ఇచ్చుకుని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో ఏముందంటే..

ఈ వీడియోను shwethaveena3 అనే ఖాతా షేర్ చేసింది. ఈ వీడియోలో, ఇద్దరు ప్రేమికులు బహిరంగ ప్రదేశంలో ముద్దు పెట్టుకుంటూ RCB విజయాన్ని జరుపుకుంటున్నారు. ఆర్సీబీ గెలిస్తేనే.. ముద్దు పెట్టుకునేందుకు ప్రియురాలు ఓకే చెప్పిందంటూ దానిలో రాశారు.. అయితే.. ఈ వీడియోలో అందరూ ఆర్సీబీ గెలిచిందంటూ చాలామంది రోడ్డుపై సంబరాలు జరుపుకుంటున్నారు. అయినప్పటికీ.. ఆ జంట మాత్రం ముద్దుతో మునిగితేలారు.. అక్కడ చాలా మంది ఉన్న కానీ.. వారిద్దరూ.. కిస్ పెట్టుకుంటూ సెలబ్రెట్ చేసుకోవడం వైరల్ అయింది.

వీడియో చూడండి..

ఈ వీడియోను 17 లక్షలకు పైగా వీక్షించారు.. అంతేకాకుండా నెటిజన్స్ పలు రకాలు ట్వీట్లు చేస్తున్నారు. ఒక వినియోగదారుడు.. “ఈ సంవత్సరం ఒక తీపి ముద్దు, వచ్చే ఏడాది మనం విరామం చూస్తాము” అని రాసుకొచ్చాడు.. మరొకరు, “RCB గెలవడానికి 18 సంవత్సరాలు పట్టింది, అతనికి 18 నిమిషాలు ఇవ్వండి” అని వ్యాఖ్యానించాడు.. మరొకరు, “ఈ ఆనందం కోసం నాకు ఒక లవర్ ఉంటే, నేను కూడా అలాగే చేసేవాడిని” అని వ్యాఖ్యానించాడు.. ఇలా ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది..

మరిన్ని ట్రెండింగ్ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి