Ratan Tata: మేము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు.. రతన్ టాటా లాస్ట్ పోస్ట్ వైరల్.. 

|

Oct 12, 2024 | 12:32 PM

పెరుగుతున్న వయస్సుకు సంబంధించిన రొటీన్ చెకప్ కోసం తాను ఆసుపత్రికి వెళ్లినట్లు.. చింతించాల్సిన పనిలేదు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానుని చెప్పారు.  అంతేకాదు  మీడియా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. రతన్ టాటా అభిమానులు ఇప్పుడు మళ్ళీ అతని చివరి పోస్ట్‌ చదువుతూ మళ్ళీ షేర్ చేస్తూ మీరు చెప్పింది నిజం కావాలని మేము కోరుకున్నాం.. మీ మాట నిజమవాలని కోరుకున్నాం ..

Ratan Tata: మేము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు.. రతన్ టాటా లాస్ట్ పోస్ట్ వైరల్.. 
Ratan Tata
Follow us on

భారతదేశపు ప్రసిద్ధ, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మన మధ్య లేరు. తీవ్ర అస్వస్థతతో 86 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి భువి నుంచి దివికేగారు. రతన్ టాటా మృతితో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. అందరూ తమదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో రతన్ టాటా చివరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చివరి పోస్ట్ చదివిన ప్రజలు ఒక్కరూ రతన్ టాటా చివరి కోరిక నిజం కావాలని  కోరుకుంటున్నామని చెప్పారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా మరణానంతరం ఆయన చేసిన చివరి సోషల్ మీడియా పోస్ట్ చాలా చర్చనీయాంశమైంది. ఇందులో ఆయన ఆసుపత్రిలో చేరిన తర్వాత తన ఆరోగ్యంపై వస్తున్న వదంతుల గురించి మాట్లాడారు. వృద్ధాప్యం కారణంగా చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చానని.. కనుక ఎవరూ తన గురించి  చింతించాల్సిన పనిలేదని పేర్కొన్నారు.

అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది గంటలకే ఆయన ఈ ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ టాటా తన ఆరోగ్యం గురించి ప్రజలు ఆందోళన చెందడం చూడకూడదనే ఇది పుకారు అంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారని తెలుస్తోంది .  ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన    అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

రతన్ టాటా తన చివరి పోస్ట్‌లో ఏమి రాశారు?

అక్టోబర్ 7న రతన్ టాటా తన ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాల విషయంపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా వ్రాశారు. ‘తన గురించి చింతిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇటీవలి రూమర్స్ గురించి తనకు తెలిసిందని . .  అయితే ఈ వాదనలన్నీ నిరాధారమైనవని తాను చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.  అంతేకాదు    పెరుగుతున్న వయస్సుకు సంబంధించిన రొటీన్ చెకప్ కోసం తాను ఆసుపత్రికి వెళ్లినట్లు.. చింతించాల్సిన పనిలేదు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానుని చెప్పారు.  అంతేకాదు  మీడియా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.

‘రతన్ టాటా చెప్పినది నిజం కావాలనుకున్నారు.. అయితే..

రతన్ టాటా అభిమానులు ఇప్పుడు మళ్ళీ అతని చివరి పోస్ట్‌ చదువుతూ మళ్ళీ షేర్ చేస్తూ మీరు చెప్పింది నిజం కావాలని మేము కోరుకున్నాం.. మీ మాట నిజమవాలని కోరుకున్నాం .. అయితే మేము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు అంటూ ఒక వినియోగదారు రాశారు. సార్ మీరు ఎందుకు మాకు  దుకు అబద్ధం చెప్పారు సార్?  మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారని పేర్కొన్నారు. మరొకరు మీరు ఇకపై మా మధ్య లేరనే విషయాన్నీ నమ్మలేకపోతున్నానంటూ కామెంట్ చేశారు .

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..