Unknown Facts: చైనీస్ సైనికుల యూనిఫాం కాలర్లలో పిన్స్.. ఎందుకు ధరిస్తారో తెలుసా?

మనం కొన్ని దేశాల సైనికుల క్రమశిక్షణ, ధైర్యసాహసాలు చూసి తరచుగా ఆశ్చర్యపోతుంటాం. కానీ దేశానికి సేవ చేయడానికి సైనికులిగా కావడానికి చేయాలసిన కృషి అంత ఇంత కాదు. ప్రతి దేశం తన సైనికులకు శిక్షణ ఇవ్వడానికి దాని స్వంత మార్గదర్శకాలను కలిగి ఉంటుంది.

Unknown Facts: చైనీస్ సైనికుల యూనిఫాం కాలర్లలో పిన్స్.. ఎందుకు ధరిస్తారో తెలుసా?
Chinese Soldiers
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2024 | 7:41 PM

మనం కొన్ని దేశాల సైనికుల క్రమశిక్షణ, ధైర్యసాహసాలు చూసి తరచుగా ఆశ్చర్యపోతుంటాం. కానీ దేశానికి సేవ చేయడానికి సైనికులిగా కావడానికి చేయాలసిన కృషి అంత ఇంత కాదు. ప్రతి దేశం తన సైనికులకు శిక్షణ ఇవ్వడానికి దాని స్వంత మార్గదర్శకాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ సైనికుల శిక్షణ మనకు గుర్తు వచ్చే దేశం చైనా.. అ దేశంలో ముఖ్యంగా సైనికులకు నిఫాంల కాలర్‌లో పిన్‌లు ఉంటాయి. చాలా మందికి ఈ విషయం తేలిదు.. ఈ విషయం తెలిసిన వారికి అసలు ఈ కాలర్‌లో పిన్‌లు ఎందుకు పెడుతారో డౌట్ కచ్చితంగా వచ్చి ఉంటుంది. యూనిఫాంల కాలర్‌లో పిన్స్ నిరంతరం సైనికులకు గుచ్చుకుంటాయి. దీంతో కొన్ని సందర్భాల్లో సైనికులు తమ విధులను నిర్వర్తించేటప్పుడు అసౌకర్యానికి గురవుతారు.

అప్పట్లో చైనా సైనికులు తమ యూనిఫాం కాలర్‌లో పిన్స్‌తో ఉన్నారని పేర్కొంటూ వేల సంఖ్యలో పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు నిజమైనవేనని ధృవీకరిస్తూ కొన్ని ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్లు 2019లో క్లెయిమ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిన్స్ అందరి సైనికులకు ఇవ్వరు ఎవరైతే భంగిమ నిటారుగా లేని సైనికులు ఉంటారో వారికి మాత్రమే ఇస్తారు. ఎవరైతే తమ మెడలను నిటారుగా ఉంచారో, అటువంటి సైనికుల కోసం ప్రత్యేకంగా పిన్స్ వారి యూనిఫారానికి జోడించబడతాయి. వారు తమ మెడను కొద్దిగా వంచి లేదా వంచి ఉంటే, పిన్స్ వాటిని గుచ్చుతాయి. దీంతో అవి వారికి నొప్పిని కలిగిస్తుంది. ఈ విధంగా, సైనికులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు.

సైనికులు తమ మెడలను నిటారుగా ఉంచడంలో సహాయపడటానికి ఇంకా అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. టోపీలను వెనుకకు ధరించడం అనే మరో టెక్నిక్‌ కూడా ఉంది. ఈ సందర్భంలో సైనికులు టోపీ పడిపోకుండా చూసుకోవడానికి వారి మెడలను నిటారుగా ఉంచాలి. ఈ బ్యాలెన్సింగ్ అభ్యాసం కూడా వారి శిక్షణలో భాగంగా ఉంటుంది. సైనికులకు ఉత్తమమైన రీతిలో శిక్షణ ఇవ్వడానికి ఇటువంటి అనేక పద్ధతులు అనుసరిస్తారు. చైనీస్ ప్రజలు క్రమశిక్షణకు మరోపేరుగా పిలుస్తారు. అందుకే పిల్లలు కూడా ఎల్లప్పుడూ కఠినమైన క్రమశిక్షణను కలిగి ఉండాలని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.