Viral Photo: ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా..? అతడి పేరే ఓ ఎమోషన్.. హిస్టరీ క్రియేట్ చేసిన పర్సన్

|

May 29, 2023 | 4:27 PM

ఇతడిది రాయల్ ఫ్యామిలీ కాదు. సిల్వర్ స్పూన్ జీవితమూ కాదు. జీతంతో జీవితం గడవాలి. అలాంటి వ్యక్తి ..కెరీర్‌లో ఎవరెస్ట్‌లు చూశాడు. పర్సనల్‌గా కోలుకోని విషాదాన్ని టచ్ చేశాడు. ఓ వైపు కెరీర్..మరోవైపు పర్శనల్ డిస్టబెన్స్. అలాంటి సిట్చువేషన్‌లో ఓ ఆటగాడిగా తన కెరీర్‌ను మలుచుకున్న తీరు...ఎందరికో ఆదర్శం. ఇంతకీ ఇతడెవరో మీరు గుర్తుపట్టారా..?

Viral Photo: ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా..? అతడి పేరే ఓ ఎమోషన్.. హిస్టరీ క్రియేట్ చేసిన పర్సన్
Viral Photo
Follow us on

ప్రజంట్ త్రో బ్యాక్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. తమ చిన్ననాటి ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. అభిమానులు వాటిని వైరల్ చేస్తున్నారు. ఇక బర్త్ డే లాంటి అకేషన్స్ ఉన్నప్పుడు అయితే ఇలాంటి త్రో బ్యాక్ పిక్స్ తెగ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ ముందుకు అలాంటి ఫోటోనే తీసుకువచ్చాం. ఈ ఫోటోలోని అబ్బాయి ఇప్పుడు తోపు క్రికెటర్. ఆటలోని మజా చూపించాడు…క్రికెట్‌కే కొత్త ఆటను నేర్పించాడు. క్రీడా అభిమానుల గుండెల్లో చిరకాలం గుర్తిండిపోయే క్రికెట్‌ను భారత్‌కు అందించాడు. క్రికెట్‌ వాల్డ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఇతడికి పేరుంది. ఇప్పుడు చాలామంది ఓ ఐడియాకు వచ్చి ఉంటారు. అతడెవరో కాదు… మహేంద్ర సింగ్ ధోని..క్రికెట్‌ ప్రపంచంలో ఓ లెజెండ్…అంతర్జాతీయ క్రికెట్‌లో మహేంద్రుడి ఇన్నింగ్స్‌కు ఎండ్ కార్డ్ పడినా…క్రికెట్ ఉన్నంత వరకు ఆ మాయ..అతని మేజిక్ చెరగని ముద్ర.

ప్రత్యర్ధుల వ్యూహాలను చాలా సైలెంట్‌గా చిత్తుచేసే వ్యూహకర్త. ఎప్పుడూ మైదానంలో టెన్షన్‌ పడిన సందర్భం లేదు. కెప్టెన్ కూల్‌ అన్న ట్యాగ్‌లైన్‌తో భారత్‌కు మరపురాని విజయాలు అందించాడు. ఏదైనా బిగ్ టోర్నీ అంటే చాలు..ఎంతటి ఎక్స్‌పీరియన్స్‌ కెప్టెన్‌ అయినా కాస్త టెన్షన్ పడతాడు. కానీ ధోని చాలా కూల్‌గా మ్యాచ్‌లను హ్యాండిల్ చేసేవాడు. మైదానంలో..డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ ఆటగాడు ఎలా ఉండాలో ధోనిని చూసి నేర్చుకోవాలని మాజీ ఆటగాళ్లు చెబుతుంటారు. జట్టు కూర్పు ఎలా ఉండాలి…ఏ ఆటగాడ్ని ఏ ఆర్డర్‌లో పంపాలో ధోనికి తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెబుతుంటారు.  సచిన్, రాహుల్ ద్రవిడ్, గంగూలీ లాంటి హేమాహేమీలు రిటైర్‌మెంట్‌ కు దగ్గరపడిన సందర్భంలో చుక్కాలేని నావలా ఉన్న భారత క్రికెట్‌కు ఓ వరంలా ధోని దొరికాడు. ఒత్తిడిని తట్టుకుని జట్టును సమర్ధవంతంగదా నడిపించగల సారధి ధోని.

భారత క్రికెట్‌ పగ్గాలు ధోని చేపట్టిన తర్వాత…టీమిండియా ఆటతీరే మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పరుగుల వేటలో ఆటగాళ్ల దూకుడు కూడా పెరిగింది. ముఖ్యంగా టీ20 సిరీస్‌లో ధోని చేసిన మ్యాజిక్ ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త ఒరవడిని సృష్టించింది.  చందమామలో మచ్చలో మహేంద్రుడి కెరీర్‌లోనూ కొన్ని కాంట్రవర్శీలు తొంగి చూశాయి. కానీ వాటికి దోని రెస్పాన్డ్‌ కాలేదు సరికదా..వాటిని కనీసం పట్టించుకున్న సందర్భం కూడా లేదు. కేవలం తన ఆటతోనే విమర్శకులకు సమాధానం ఇచ్చేవాడు. కెప్టెన్సీ టైంలో ధోనిపై అనేక విమర్శలొచ్చాయి. ఓ రకంగా సీనియర్స్ కెరీర్‌కు ధోనీనే బ్రేక్ వేశాడన్న కామెంట్స్ వినిపించాయి. యువరాజ్ సింగ్ కెరీర్‌కు ధోనినే బ్రేక్ చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు యువరాజ్ సింగ్ తండ్రి కూడా ధోనిని డైరెక్ట్‌గా తిట్టాడు కూడా. అలాగే ద్రవిడ్ లాంటి సీనియర్‌ను ధోని కావాలనే పక్కన పెట్టాడన్న ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపై ధోని ఏనాడూ స్పందించలేదు. కేవలం తన ఆటను ఆడుకుంటూ వెళ్లాడు తప్ప. అందుకే మహేంద్ర సింగ్ ధోనిని మిస్టర్ కూల్ అంటారు క్రీడా పండితులు. కాగా నేడు జరగనున్న ఫైనల్‌తో ధోని ఐపీఎల్ కెరీర్‌కు గుడ్ బై చెబుతాడని అంటున్నారు. అలా జరగకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..