
సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగినప్పటి దగ్గర నుంచి.. ప్రపంచం నలమూలల చిన్న విషయం జరిగినా కూడా.. క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఫన్నీ వీడియోలు మాట అటుంచితే.. జంతు ప్రపంచానికి సంబంధించిన వీడియోలు మాత్రమే భలేగా హల్చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా సరీసృపాల వీడియోలపై నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తారు. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
ఇది చదవండి: చేసినవి 27 మూవీస్.. కానీ హిట్స్ మాత్రం రెండు.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అరాచకం చూస్తే
మీరు మొదటిగా వీడియోను చూడగానే అనకొండ అనుకునేరు.. కానీ అది బ్లాక్ పెర్షియన్ వైపర్. ఇరాన్, ఇరాక్ లాంటి ప్రాంతాల్లో కనిపించే అరుదైన విషపూరిత పాము ఇది. ఎక్కువగా రాతి కొండలు, గడ్డి భూములలో సంచరిస్తుంది. సాధారణంగా ఈ వైపర్ పాములకు విషం ఎక్కువగా ఉంటుంది. మనుషులకు దూరంగా ఉండే ఈ వైపర్ స్నేక్.. ఎక్కువగా తన ఉనికిని రహస్యంగా ఉంచుతుంది. కొండపై ట్రెక్కింగ్‌కు వెళ్లేవారు ముఖ్యంగా ఇలాంటి పాములకు దూరంగా ఉండాలి. ఇవి నక్కి నక్కి ఉండటంతో.. మూలాల మాటున కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని జంతు సంరక్షణ అధికారులు అంటున్నారు. మరి ఆ వీడియోపై మీరూ ఓసారి లుక్కేయండి.
ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా