రక్షా బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ నేటి బిజీ లైఫ్ స్టైల్ పండుగ లేదా ప్రత్యేకమైన రోజుని మర్చిపోయేలా చేస్తుంది. అందుకు ఉదాహరణగా నిలిచే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ విమానయాన సంస్థ ఇండిగోలో పనిచేస్తున్న ఓ యువతి.. రాఖీ సందర్భంగా డ్యూటీలో ఉండగానే తన సోదరుడికి రాఖీ కట్టింది. ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమానంలో విధులు నిర్వహిస్తున్న ఆమె.. అదే విమానంలో పైలట్‌గా ఉన్న తన సోదరుడికి రాఖీ కట్టింది. ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలట్ గా ఉన్న తన సోదరుడు గౌరవ్ కు అదే విమానంలో క్యూబిన్ క్రూ మెంబర్ గా ఉన్న శుభ రాఖీ కట్టింది. ఈ వీడియోను ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ అందమైన క్షణాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
At 30,000 feet or on the ground, the bond of a brother and sister remains special.
A heartwarming moment on board today as our Check Cabin Attendant Shubha celebrates Rakhi with her brother Capt. Gaurav. #HappyRakshaBandhan2023 #HappyRakhi #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/WoLgx8XoIa ఇవి కూడా చదవండి— IndiGo (@IndiGo6E) August 30, 2023
వైరల్ అవుతున్న ఈ వీడియోలో… ఇండిగో విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో శుభ ప్రయాణీకులకు ఓ అనౌన్స్ ఇచ్చింది.. ఫ్లైట్ ఇంటర్‌ఫోన్ సిస్టమ్ ద్వారా ప్యాసింజర్స్‌తో తన మాటలను పంచుకుంది.. ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లూ సాధ్యపడదు. ముఖ్యంగా మాలాంటి ఉద్యోగులకు..తమ ప్రియమైన వారితో కలిసి వేడుకు జరపుకునేలా మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం ముఖ్యం కాబట్టి. ఈ రోజు నాకు, మా అన్న కెప్టెన్ గౌరవ్‌కు చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పింది శుభ. ఎందుకంటే.. చాలా ఏళ్ల తర్వాత తామిద్దరం కలిసి రక్షా బంధన్ జరుపుకుంటున్నామని చెప్పింది. అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టింది. ఆ వెంటనే అతడు కూడా ఆమె కాళ్లకు నమస్కారించి ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు.
30వేల అడుగల ఎత్తున ఉన్నా, భూమి మీద ఉన్న ఎక్కడున్నా బ్రదర్ అండ్ సిస్టం బాండింగ్ స్పెషల్ అంటూ ఈ వీడియోను ఇండిగో ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతమైన ప్రశంసలు కురిపించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..