
రాజస్థాన్ రాష్ట్రంలోని బారాన్ నగరంలో నిన్న రాత్రి డోల్ మేళా జరిగింది. లెక్క లేనంత జనం వచ్చారు. అందరూ తమ తమ కుటుంబాలతో, సన్నిహితులతో సరదాగా గడుపుతున్నారు. ఎత్తైన జెయింట్ వీల్, జూలాల లాంటివి ఎక్కి లోకాన్ని మర్చిపోయి సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఊహించని సంఘటన జరిగింది. ఆటవిడుపులో భాగంగా జూలా బజార్‌లో జూలాలో ఊగుతున్న ఒక యువతి అకస్మాత్తుగా అందరూ చూస్తుండగానే జారి కింద పడిపోయింది. అంతెత్తు నుంచి ఏదో బొమ్మను విసిరేసినట్లుగా ఆ యువతి జారి కింద పడిపోవడం అక్కడి వారిని షాక్‌కు గురి చేసింది.
క్షణాల్లో జరిగిపోయిన ఈ ఊహించని ఘటనను చూసి అంతా ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్నట్లుగా.. బోటు ఆకారంలో ఉన్న జూలాలో కూర్చున్న ఆ యువతి, జూలా పైభాగానికి ఎగిరినప్పుడు సమతుల్యం కోల్పోయి కింద పడిపోయింది. అలా ఉన్నట్లుండి జారిపడిన ఆ యువతి అక్కడ కిందే ఉన్న ట్యూబ్‌లైట్‌పై పడిపోయింది. ఏం జరిగిందోనని అర్థం చేసుకుని అక్కడున్న వాళ్లు తేరుకునేలోపే ఆ యువతి అంతెత్తున నుంచి పడడంతో నొప్పితో విలవిలాడుతుండడం కనిపించింది.
వీడియో ఇక్కడ చూడండి..
వెంటనే స్థానికులు ఆమెను దగ్గరలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతికి చికిత్స అందుతోంది. ఊహించని ఘటనలు ఇలా జరిగినప్పుడే ఒక రకంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడతారు కనుక, ఎగ్జిబిషన్ లాంటివి వెళ్లినప్పుడు పిల్లల భద్రత పట్ల కొంచెం దృష్టి సారిస్తే మేలు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..