రైల్వేకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా క్రేజ్ యువత తలెకెక్కిందని చెప్పాలి. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి, తమ ఫాలోవర్స్‌ను పెంచుకోవడం కోసం వారు ఎలాంటి పనికైనా సిద్ధపడుతున్నారు. దీని కోసం చాలాసార్లు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇందులో రీలు తీస్తూ ఓ యువతి దారుణంగా మరణించింది.
వైరల్ వీడియోకు సంబంధించి… మెక్సికోలోని హిడాల్గోకు చెందిన ఒక సందర్భం. ఇక్కడ చాలా మంది రైల్వే ట్రాక్‌పై నిలబడి రైలు కోసం వేచి చూస్తున్నారు. అక్కడివారంతా ఈ రైలుతో సెల్ఫీలు, వీడియోలు తీసుకోవాలని ఆరాటంగా ఉన్నారు. ఎందుకంటే.. ఇది ఆవిరి మీద నడిచే ఇంజిన్‌తో పనిచేస్తుంది. కెనడా నుండి మెక్సికో సిటీకి ఈ రైళ్లో ప్రయాణించవచ్చు. స్టీమ్ ఇంజిన్ రైలు కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ట్రాక్‌లకు దగ్గరగా నిలబడి రైలు రాకకోసం ఎదురు చూస్తున్నారు. అయితే వారి సంతోషం క్షణాల్లోనే దుఃఖంగా మారుతుందని ఎవరికీ తెలియదు. అది స్టీమ్ ఇంజిన్ రైలు.. మెరుపు వేగంతో దూసుకొచ్చింది. అక్కడ ఫోన్ పట్టుకుని నిలబడి ఉన్న ఆ యువతి రైలుతో సెల్ఫీ వీడియో తీస్తూ అమాంతంగా కుప్పకూలిపోయింది. వీడియో తీస్తున్న క్రమంలో ట్రాక్‌కు అతి సమీపంలోకి రావటంతో ఆమెను రైలు ఢీకొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పక్కనే ఉన్న ఆమె స్నేహితులు ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపుగానే ఘోరం జరిగిపోయింది. తోటి స్నేహితులు ఆమెను ఎంత పిలిచినా ఆమెలో ఎలాంటి చలనం కనిపించలేదు.
ఊహించని ప్రమాదంతో యువతి మృతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో ఇలాంటి వారంతా గుణపాఠం నేర్చుకోవాలని అంటున్నారు. ఇలా రీల్స్ పిచ్చితో తిరిగే వారు మన భద్రతను మనం తప్పక చూసుకోవాలంటున్నారు.. చిన్నపాటి అజాగ్రత్త ప్రాణాలను బలిగొంటుంది అనడానికి ఇప్పటి వరకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
MEXICO – In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments. pic.twitter.com/32XdsCehEB
— The Many Faces of Death (@ManyFaces_Death) June 5, 2024
రైల్వే నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లపై ఎలాంటి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీయడం నేరం. కాబట్టి, మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు, స్టేషన్‌లో సెల్ఫీలు తీసుకోవడం, రీళ్లు తయారు చేయడం మానుకోండి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..