ఓ బస్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సు లగేజీ బాక్స్ నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అక్కడే ఉన్న డ్రైవర్.. ఏమై ఉంటుందని చూసేందుకు వెళ్లాడు. భయం.. భయంగానే చెక్ చేయగా.. అక్కడ ఓ భారీ కొండచిలువ తిష్ట వేసుకుని కూర్చుంది. దాన్ని చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సివిల్ లైన్స్ బస్టాండ్‌లో ఓ బస్సు ఆగి ఉంది. ఇక అందులోని లగేజ్ బాక్స్ నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. వాటిని గమనించిన బస్సు డ్రైవర్ ఏంటా అని చూసేందుకు ప్రయత్నించాడు. లగేజ్ బాక్స్ చెక్ చేయగా.. భారీ కొండచిలువ ఒకటి అక్కడ తిష్ట వేసుకుని కూర్చునట్లు గమనిస్తాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందిస్తాడు. వారు విషయాన్ని తెలుసుకున్న వెంటనే స్పాట్‌కు చేరుకొని.. అతికష్టం మీద కొండచిలువను పట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.