Python Attacking on Moving Car: అడవులు క్రమంగా అంతరించిపోతుండటంతో.. జంతువులు మైదాన ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఇలాంటి క్రమంలో కొన్ని జంతువులు.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. కొన్ని సార్లు దాడులకు కూడా వెనకాడవు. అలాంటి జంతువుల్లో పాములు కూడా ఒకటి.. పాము పేరు వింటేనే మనం భయంతో పరుగులు తీస్తుంటాం. అలాంటిది పాడు సడెన్‌గా ఎటాక్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అది కూడా కారులో వెళ్తుంటే.. ఎటాక్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. భయమేస్తుంది కదా.. అయితే.. అచ్చం ఇలాంటి ఘటనకు సంబంధించిన వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో.. అటవీ ప్రాంతంలోని రహదారి మధ్యలో ఒక పైథాన్ ఉంటుంది. దాని పక్కన వెళుతున్న ఓ కారుపై అది అకస్మాత్తుగా మెరుపు దాడి చేస్తుంది. అదృష్టం ఏమిటంటే.. కారుకి దానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. కావున ఎలాంటి ప్రమాదం జరగదు. అయితే.. ఆతర్వాత ఆ పాము వీడియో తీస్తున్న వాహనదారుడి కారు కిందకు వెళుతుంది. వెంటనే పైథాన్ కారులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. డ్రైవర్, ప్రయాణికులు.. వెంటనే కారు కిటికీలను మూసివేస్తారు. అయితే ఆ పైథాన్ కారు లోపలికి కాకుండా.. బోనెట్ లోపలికి వెళుతుంది.
వైరల్ వీడియో..
ఆ తర్వాత ప్రయాణికులు.. ఈ విషయాన్ని స్నాక్ క్యాచర్‌కు చెప్పడంతో.. అతను వచ్చి పైథాన్‌ను బోనెట్ నుంచి బయటకు తీస్తాడు. ఆ తర్వాత దాన్ని రోడ్డు అవతలి వైపునున్న పొదల్లో వదిలిపెడతాడు. ఈ వీడియోను యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ సైటింగ్స్ షేర్ చేసింది. దీనిని చాలామంది షేర్ చేస్తూ పలు కామెంట్లు చేస్తున్నారు. పాములతో జాగ్రత్తగా ఉండాలంటారు.. అందుకేనంటూ పేర్కొంటున్నారు. అయితే ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: