
కొండచిలువ విషపూరితమైనది కాకపోవచ్చు. అయితే ఇది దాచి చేస్తే ప్రమాదకరం. కొండ చిలువ ఎవరినైనా పట్టుకుంటే.. వారిని ఊపిరాడకుండా చేసి ఆపై వారిని సజీవంగా తినేస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ అలాంటి ప్రమాదకరమైన పాములతో చెలగాటం ఆడడానికి కొంతమంది వెనుకాడరు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో అందుకు మంచి ఉదాహరణ. ఇందులో కొండచిలువ ముందు వీరత్వం చూపించినందుకు ఒక యువకుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కెమెరాలో రికార్డ్ చేయబడినది చూస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
వైరల్ అవుతున్న వీడియోలో చేతిలో కొండచిలువ పట్టుకుని కెమెరా ముందు ఒక యువకుడు నటిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే మరు క్షణంలో జరిగిందో చూస్తే ఎవరి ఆత్మ అయినా వణికిపోతుంది.
వీడియోలో ఆ యువకుడు కొండచిలువతో నిర్భయంగా సరదాగా గడుపుతున్నట్లు కనిపిస్తుంది. అయితే కొండచిలువ తల దగ్గర తన చేతిని పట్టుకోగానే, పాము అతని ముఖంపై చాలా వేగంగా దాడి చేసింది. ఈ దాడి చాలా వేగంగా జరిగింది.. ఆ యువకుడికి జరుగుతుంది ఏమి అని అర్ధం చేసుకునే అవకాశం కూడా రాలేదు.
స్నేక్‌సేవరాఫ్సర్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి షేర్ చేయబడిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో దావానలంలా వ్యాపిస్తోంది. ప్రజలు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు యువత అజాగ్రత్తను ప్రశ్నిస్తున్నారు. మరికొందరు జంతువులతో చెలగాటం ఆడడం ప్రాణాంతకమని చెబుతున్నారు.
ఒక యూజర్.. “ఎప్పటికైనా ఇదే అత్యుత్తమ ముద్దు” అని కామెంట్ చేసాడు. మరొక యూజర్, “భాయ్ కి దక్కాల్సినది దక్కింది” అని అన్నాడు. రీల్స్ కోసం ఇలాంటి పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. అసలు బాధ్యత లేని యువటగా మారుతున్నారు అని వ్యాఖ్యానిస్తూ.. యువత తీరుపై నిరసన చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..