
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది.. భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా మేనియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ అవార్డు కూడా వరించింది. అయితే, గంధపు చెక్కల స్మగ్లింగ్ కథాంశంగా సాగే ఈ సినిమాలోని సీన్లు, అల్లు అర్జున్ నటన.. ఫుల్ ట్రెండ్ అయింది. అయితే, పుష్ప సినిమా స్టైల్లో గంధపు చెక్కలు, డబ్బు, గంజాయ్, డ్రగ్స్, నిషేధిత వస్తువులను అక్రమంగా తరలిస్తున్న వారిని తరచూ పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా.. పుష్ప మాదిరి సీన్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇక్కడ కూరగాయాల మాటున గంజాయ్ తరలిస్తూ నిందితులు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
చూసే వారికి అది వెజిటేబుల్స్ ట్రాన్స్‌పోర్ట్ చేసే వాహనంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు వాహనాన్ని ఆపి చెక్ చేశారు.. కానీ ఏం కనిపించలేదు.. ఈ క్రమంలో కాని కింది భాగం తెరిచి చూశారు.. దీంతో ఓనర్ అసలు రంగుబయట పడింది. కూరగాయల మాటున గంజాయి తరలిస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనం కింది భాగంలో ఓ బాక్సును ఏర్పాటు చేసుకుని కొన్ని రోజులుగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఎన్నికల తనిఖీల్లో భాగంగా వాహనాన్ని చెకింగ్ చేయగా వాహనం కింది భాగంలో దొరికిన 635 కిలోలా ఎండు గంజాయి పట్టుబడింది. దీని విలువ మూడు కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకి గంజాయి తరలిస్తున్న రెండు బొలెరో వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు హనుమాన్, మోహిత్, సమీర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..