Viral News: ఇరుకు రోడ్డులో కారు వేగంగా పోతోంది.. వెనుక పోలీసులు వెంబడిస్తున్నారు.. రోడ్డుపై వాహనాదారులను గుద్దుకుంటూ వేగంగా ముందుకెళ్తున్నాడు.. ఆకారు వెనుక మరో స్కార్పియో వాహనంలో పోలీస్ .. కారులో వ్యక్తులను పట్టుకునేందుకు తుపాకి కాల్పులు.. అయినా ఆగకుండా ముందుకెళ్తోంది.. కారు, ఇది చూసిన వారంతా ఇదేమైన సినిమా షూటింగ్ అనుకుంటే పొరపాటే.. పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ లో రియల్ సీన్. రోడ్డుపై సీసీ కెమెరాల్లో ఈదృశ్యాలన్ని రికార్డు అయ్యాయి. ఇంతకీ ఆకారును పోలీసులు ఎందుకు వెంబడిస్తున్నారనుకుంటున్నారా.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
మారుతి సుజుకి డిజైర్ కారులో ఇద్దరు వ్యక్తులు హెరాయిన్ ను తీసుకుని వెళ్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆకారులోని వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆకారులోని వ్యక్తులు ఇరుకు రోడ్డులో వేగంగా వెళ్లిపోతుండగా వారిని పోలీసులు వెంబడించారు. ఒక చోట స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను కారుతో ఢీకొట్టి..ఆగకుండా వెళ్లిపోతున్నాడు. ఆసమయంలో వెనకాల వాహనంలో ఉన్న పోలీసు తుపాకితో కారు టైర్ పై కాల్పులు జరిపాడు. అయినా ఆగకుండా అక్కడి నుంచి మరికొంత దూరం కారులో ముందుకెళ్లిపోయాడు. కారు ముందు బంపర్లు వేలాడుతున్నా ఆగలేదు. ఆకారులో వ్యక్తిని పట్టుకునేందుకు ఓ పోలీస్ పరిగెత్తడం చూసిన వారంత ఆశ్చర్యపోయారు. చివరికి దుండుగుడు దొరకడంతో కారులో తనిఖీలు చేసిన పోలీసులు పది గ్రాముల హెరాయిన్ ని పట్టుకున్నారు. కారులో వ్యక్తులను పట్టుకున్నామని..అయితే వారి కోసం పది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
Punjab Police today nabbed 2 drug peddlers after a hot chase. The dramatic turn of events unfolded in broad daylight near Bansi Gate area in the heart of Ferozepur city. The incident was captured on CCTV camera and the recording went viral. pic.twitter.com/UVZOYrieIX
— Gagandeep Singh (@Gagan4344) August 8, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి