Bhang Ka Coffee: గంజాయి కాఫీ, గంజాయి శాండ్‌విచ్.. ఈ కాఫీ షాప్‌లో ఇదే చాలా స్పెషల్.. ఎక్కడంటే..

|

Jun 07, 2022 | 1:11 PM

మహారాష్ట్రలోని పూణేలో 'ది హెంప్ కెఫెటేరియా' అనే కాఫీ షాప్ ఉంది. కాఫీ, శాండ్‌విచ్‌లు ఇక్కడ ప్రధానమైనవి. కానీ ఇది ఇతర దుకాణాల నుంచి భిన్నంగా ఉండటానికి కారణం ఇక్కడ విక్రయించే శాండ్‌విచ్‌లు, కాఫీతో 'భాంగ్'ని కలపడం.

Bhang Ka Coffee: గంజాయి కాఫీ, గంజాయి శాండ్‌విచ్.. ఈ కాఫీ షాప్‌లో ఇదే చాలా స్పెషల్.. ఎక్కడంటే..
Cannabis Coffee
Follow us on

భారతదేశంలో గంజాయి చట్టవిరుద్ధం, మనందరికీ తెలుసు. అయితే, ఇది పూణే కేఫ్‌కి భాంగ్ కా శాండ్‌విచ్‌లు లేదా హెంప్ కాఫీని అందించకుండా నిరోధించ లేదు. ఇది చట్టానికి కూడా వ్యతిరేకం కాదు. పూణేలోని సదాశివ్ పేత్ పరిసరాల్లోని హెంప్ కెఫెటేరియా , క్లయింట్‌లకు వరం. 30 సంవత్సరాల వయస్సులో ది హెంప్ కేఫ్ ను ఓ యువ మహిళ యజమాని అమృత షిటోలే పూణేలో గంజా కేఫ్‌ని ప్రారంభించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఆమె గంజాయి ఆధారిత ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అమృత.. మహారాష్ట్రలోని పూణేలో ‘ది హెంప్ కెఫెటేరియా’ అనే కాఫీ షాప్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కాఫీ, శాండ్‌విచ్‌లు ఇక్కడ చాలా స్పెషల్. కానీ ఇది ఇతర షాపుల నుంచి భిన్నంగా ఉండటానికి కారణం.. ఇక్కడ విక్రయించే శాండ్‌విచ్‌లు, కాఫీలో ‘భాంగ్’ని కలపడం. ఇక్కడ భాంగ్ కాఫీ, భాంగ్ శాండ్‌విచ్‌లను ఇదే పేరుతో విక్రయిస్తారు.

భాంగ్ అనేది గంజాయి మొగ్గ, ఆకు లేదా పువ్వుతో తయారు చేయబడిన ఒక తినదగిన, ఔషధ సమ్మేళనం. ఇది సాధారణంగా హోలీ రోజు మాత్రమే భాంగ్‌తో తయారుచేసిన పానీయాన్ని విక్రయిస్తారు. అది కూడా కొందరు వ్యక్తిగతంగానే తయారు చేసుకుంటారు. ఈ భాంగ్ డ్రింక్‌ని ఉత్తరాదిలో ఒక రోజు మాత్రమే తయారు చేసి సేవిస్తారు. ఇక ఏడాదిలో ఎన్నడూ తయారు చేయరు.. ఎవరికి విక్రయించరు..

అయితే ఇదే ఫార్ములాను ఇప్పుడు ఓ కాఫీ షాప్ ఓనర్ తన వ్యాపారం కోసం వినిగిస్తున్నారు. అచ్చు అదే ఫార్మూలతోనే భాంగ్ కాఫీ, భాంగ్ శాండ్‌విచ్‌లను తయారు చేస్తున్నారు. ఈ కాఫీ షాప్‌కు అక్కడి ప్రభుత్వం(పూణే) అధికారికంగా అనుమతి ఇచ్చింది. “హెంప్ కాఫీ షాప్‌”లో ఈ పూణే డ్రింక్ మాదిరిగానే ఔషధ పదార్ధాలతో తయారు చేసి విక్రయించుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ దుకాణం పూణేలో నడిపిస్తున్నారు. షాపు యజమాని కూడా ఓ మహిళ కావడం విచిత్రం. గత నాలుగేళ్లుగా “హెంప్ కాఫీ షాప్‌”ను నిర్వహిస్తున్నట్లుగా అధినేత అమృత వెల్లడించారు.

గంజాయి సాగుకు అనుమతి..

మహారాష్ట్రలో గంజాయి సాగుకు అనుమతి లేదు. కానీ ఉత్తరాఖండ్‌లో గంజాయి సాగుకు అనుమతి ఉంది. మహారాష్ట్రలో గంజాయి సాగు చేసేందుకు చట్టపరంగా అనుమతి వచ్చేలా చర్యలు తీసుకునాని “హెంప్ కాఫీ షాప్‌” ఓనర్ అమృత తెలిపారు. గత కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాను. ఉత్తరాఖండ్ నుంచి తెచ్చిన భాంగ్ మెడిసిన్ బాగా ఉపయోగపడిందని తెలిపారు. అదే తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అని వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి సాగు చట్టబద్ధం చేయాలని అమృతా షిటోల్ మహారాష్ట్రలో కూడా పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే, గంజాయి మొక్క గణనీయంగా తక్కువ నీటిని ఉపయోగిస్తుందని అన్నారు.

మహారాష్ట్రలోని పూణేలో ‘ది హెంప్ కెఫెటేరియా’ అనే కాఫీ షాప్ ఉంది. కాఫీ, శాండ్‌విచ్‌లు ఇక్కడ ప్రధానమైనవి. కానీ ఇది ఇతర దుకాణాల నుంచి భిన్నంగా ఉండటానికి కారణం ఇక్కడ విక్రయించే శాండ్‌విచ్‌లు, కాఫీతో ‘భాంగ్’ని కలపడం. ఇక్కడ బ్యాంక్ కాఫీ,  బ్యాంక్ శాండ్‌విచ్‌లను విక్రయిస్తారు.

ట్రెండింగ్ వార్తల కోసం..