
అమ్‌స్టర్‌డామ్‌లోని వరల్డ్ ప్రెస్ ఫోటో ఈ ఏడాది ఉత్తమ ఫోటోను రిలీజ్ చేసింది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన మారణ హోమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో రెండు చేతులు కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలుడి ఫొటో 2025 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకుంది. పాలస్తీనియన్ మహిళా ఫొటోగ్రాఫర్ సమర్ అబు ఎలౌఫ్ ది న్యూయార్క్ టైమ్స్ కోసం ఈ ఫొటో తీశారు.
The #WPPh2025 Photo of the Year is ‘Mahmoud Ajjour, Aged Nine’ by @samarabuelouf, for @nytimes. The jury was moved by this portrait of a Palestinian boy which speaks to the devastating long-term costs of war on civilians. Read more: https://t.co/KHmkUjt2Rj pic.twitter.com/QP3lqEBWaR
ఇవి కూడా చదవండి— World Press Photo (@WorldPressPhoto) April 17, 2025
ఇందులో ఉన్న బాలుడి పేరు మహ్మద్ అజ్జౌర్. అతని వయసు తొమ్మిదేళ్లు. ఇజ్రాయెల్, హమాస్ ల ధ్య యుద్ధం ఈ చిన్నారి బాల్యాన్ని చిదిమేసింది. హాయిగా ఆడుతూ పాడుతూ ఉండాల్సి జీవితాన్ని ఇలా జీవం ఉన్న శవంలా మార్చేసింది.
ఇదిలా ఉటే, 8వ వేడుకగా జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక ఫొటో జర్నలిజం పోటీల్లో 141 దేశాలకు చెందిన 3,778 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. వారు ఏకంగా 59,320 ఎంట్రీలను సమర్పించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..