డాడీ వెళ్ళద్దు.. చిన్నారి మారాం.!

|

Apr 29, 2019 | 4:28 PM

పోలీస్ డ్యూటీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసులు తమ కుటుంబాలను సైతం ప్రక్కన పెట్టి రాత్రి, పగలు లేకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా.. సమయం గురించి పట్టించుకోకుండా అక్కడికి క్షణాల్లోనే చేరుకుంటారు. వారు అసలు కుటుంబసభ్యులకు సమయం కేటాయించడమే తక్కువ. అలాంటిది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సంగతి వేరే చెప్పాలా.. మాములుగానే తల్లిదండ్రులు బయటికి వెళుతుంటే నేనూ వస్తానని మారాం చేస్తుంటారు. ఇక సరిగ్గా […]

డాడీ వెళ్ళద్దు..  చిన్నారి మారాం.!
Follow us on

పోలీస్ డ్యూటీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసులు తమ కుటుంబాలను సైతం ప్రక్కన పెట్టి రాత్రి, పగలు లేకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా.. సమయం గురించి పట్టించుకోకుండా అక్కడికి క్షణాల్లోనే చేరుకుంటారు. వారు అసలు కుటుంబసభ్యులకు సమయం కేటాయించడమే తక్కువ. అలాంటిది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సంగతి వేరే చెప్పాలా.. మాములుగానే తల్లిదండ్రులు బయటికి వెళుతుంటే నేనూ వస్తానని మారాం చేస్తుంటారు. ఇక సరిగ్గా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భువనేశ్వర్‌కు చెందిన ఓ పోలీసు ఆఫీసర్‌ డ్యూటీకి వెళ్లడానికి యూనిఫాం వేసుకొని రెడీ అయ్యాడు. సరిగ్గా అదే సమయంలో దాదాపు నాలుగేళ్ళ ఆయన కొడుకు ఏడుస్తూ ‘నన్ను వదిలి వెళ్ళద్దు నాన్నా’ అంటూ కాళ్లను పట్టుకుని విడవలేదు. ఆయన ఎంతగా సముదాయించాలని చూసినా.. ఆ పిల్లాడు కాళ్లనే పట్టుకుని వేలాడాడు. మారాం చేసే పిల్లలంటే ఇలాగే ఉంటారు మరి.!