Viral Video: ఇకపై హెల్మెట్‌ లేదంటే ఐదు రెట్లు జరిమానా.. పోలీసుల వెరైటీ ఎవేర్ నెస్..

|

Sep 18, 2022 | 6:14 PM

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని వారిపట్ల విసుగు చెందిన ఓ పోలీసు అధికారి రూల్ బ్రేకర్లకు అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేశారు.

Viral Video: ఇకపై హెల్మెట్‌ లేదంటే ఐదు రెట్లు జరిమానా.. పోలీసుల వెరైటీ ఎవేర్ నెస్..
Helmet
Follow us on

Viral Video: మన దేశంలో చాలా మంది ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రతను సీరియస్‌గా తీసుకోరు. ముఖ్యంగా సోమరితనంతో హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని వారిపట్ల విసుగు చెందిన ఓ పోలీసు అధికారి రూల్ బ్రేకర్లకు అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. హెల్మెట్ ధరించకుండా టూవీలర్‌ నడుపుతున్న వ్యక్తితో  ఓ పోలీసు ఉల్లాసంగా స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైకీ యాదవ్ అనే వినియోగదారు ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోకు 191k వ్యూస్‌, 9,500 లైక్‌లు వచ్చాయి. ఇంతకీ వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఏముందంటే…

హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతున్న వ్యక్తిని ఒక పోలీసు అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఆ పోలీసు అధికారి మెల్లగా ఆ వ్యక్తి తలపై హెల్మెట్‌ పెడతాడు. ఏదో మంత్రం పఠిస్తున్నట్లుగా అతనికి ట్రాఫిక్ నిబంధనలను వివరిస్తున్నారు. ఆ తరువాత పోలీసు అధికారి హెల్మెట్ ధరించమని ఆ బైకర్‌ను వేడుకున్నాడు. హెల్మెట్ ధరించకుండా ఎవరైనా పట్టుబడితే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రస్తుతం ఉన్న మొత్తం కంటే ఐదు రెట్లు జరిమానా విధించబడుతుందని సదరు పోలీసు వివరించాడు. బైక్‌పై ప్రయాణించేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, భద్రతా నియమాలను పాటించాలని చెప్పి.. అతడికి నమస్కరించారు. ఆ వ్యక్తి కూడా ప్రతి నమస్కారం చేశాడు. నెటిజన్లు ఈ వీడియోను చూసి, ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు ఇలా వినూత్న మార్గంలో అవగాహన కల్పించినందుకు ఆ అధికారిపై ప్రశంసల కామెంట్లు కుమ్మరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దేశవ్యాప్తంగా 4 లక్షల 22 వేల 659 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇది అంతకుముందు ఏడాది (3 లక్షల 68 వేలు) కంటే ఎక్కువ. ఈ ప్రమాదాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 24 వేల 711 మంది మరణించారు. 16,685 మరణాలతో తమిళనాడు 2వ స్థానంలో ఉంది. ఇది మొత్తం మరణాల్లో 9.6 శాతం. మహారాష్ట్ర 3వ స్థానంలో ఉంది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2021లోనే తమిళనాడులో రోడ్డు ప్రమాదాల కేసులు 22.4% పెరిగాయి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 2020లో 46 వేల 443 కాగా 2021 నాటికి 57 వేల 90కి పెరిగింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి