
కనీసం మానవత్వాన్ని మరిచి ప్రవర్తించాడు ఓ పోలీస్ ఆఫీసర్. రైల్వే స్టేషన్‌లో అతడు చేసిన పనికి తిట్టిపోస్తున్నారు. ఆ పోలీస్ అధికారిక చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయమేంటంటే.. రైళ్ల రాకపోకల్లో ఆలస్యం జరగడం సర్వసాధారణమైన విషయమే. దీంతో ప్రయాణికులు రైలు వచ్చేంత వరకు కునుకు తీస్తుంటారు. రైల్వే స్టేషన్స్‌లో అలా సేదతీరుతుంటారు. ఇలా సేదతీరుతున్న వారిపైనే ఓ పోలీస్ ఆఫీసర్ నీచంగా ప్రవర్తించాడు.
ఒక వాటర్ బాటిల్‌ను పట్టుకొని పడుకున్న వారందరిపై నీళ్లు జలుతూ వెళ్లాడు. దీంతో ప్రయాణికులు ఉలిక్కిపడి లేశారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ అయ్యింది. ‘పుణె రైల్వేస్టేషన్’లో ఈ సంఘటన జరిగినట్లు సదరు ట్వీట్ చేసిన వ్యక్తి పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ఆఫీసర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. పడుకున్న ప్రయాణికుల పట్ల పోలీస్ ఆఫీసర్ వ్యవహరించిన తీరు దారుణమని, కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించడం అన్యాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే అధికారులు అతడిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
RIP Humanity 🥺🥺
Pune Railway Station pic.twitter.com/M9VwSNH0zn
— 🇮🇳 Rupen Chowdhury 🚩 (@rupen_chowdhury) June 30, 2023
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..