Viral Video: మనతో పెట్టుకుంటే అట్లుంటది మరి.. హెల్మెట్ లేదని పోలీసులు చలనా వేసినందుకు లైన్ మెన్ ఏం చేశాడంటే..

|

Aug 25, 2022 | 5:44 PM

బండి మీద వెళ్తున్నప్పుడు రూల్స్ పాటించకపోతే పోలీసులు ఆపి చలానా వేయడం సర్వసాదారణంగా చూస్తుంటాం. ఒక్కోసారి చలానా వేస్తుంటే మనం పలానా.. ఏదో పనిమీద వెళ్తూ అర్జెంట్ గా వచ్చేశాం.. ఇకనుంచి రూల్స్ ఫాలో అవుతాం చలనా వద్దంటూ వచ్చేస్తాం. ఎంత చెప్పినా..

Viral Video: మనతో పెట్టుకుంటే అట్లుంటది మరి.. హెల్మెట్ లేదని పోలీసులు చలనా వేసినందుకు లైన్ మెన్ ఏం చేశాడంటే..
Lineman
Follow us on

Viral News: బండి మీద వెళ్తున్నప్పుడు రూల్స్ పాటించకపోతే పోలీసులు ఆపి చలానా వేయడం సర్వసాదారణంగా చూస్తుంటాం. ఒక్కోసారి చలానా వేస్తుంటే మనం పలానా.. ఏదో పనిమీద వెళ్తూ అర్జెంట్ గా వచ్చేశాం.. ఇకనుంచి రూల్స్ ఫాలో అవుతాం చలనా వద్దంటూ వచ్చేస్తాం. ఎంత చెప్పినా ఒక్కోసారి పోలీసులు చలానా వేసి తీరుతారు. అప్పుడు మనకు మాములుగా కోపం రాదు. ఎంత బతిమలాడిన కనికరం చూపించకపోతే వెంటనే ఏదోలా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాం.. కాని ప్రతీకారం తీర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు. అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా రివేంజ్ తీర్చుకోకుండా ఉండలేం. సేమ్ టు సేమ్ ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. తాను విధి నిర్వహణలో ఉన్నానని.. ఇక నుంచి హెల్మెట్ పెట్టుకుంటానని చెప్పినా చలనా విధించినందుకు ప్రతీకారంగా లైన్ మెన్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ లోని షామ్లీలో విద్యుత్తు శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మెహతాబ్ హెల్మెట్ ధరించకుండా బైక్ పై వెళ్తున్నాడు. దీంతో ట్రాపిక్ పోలీసులు ఆపి.. హెల్మెట్ పెట్టుకోలేందని అడగ్గా.. తాను లైన్ మెన్ అని.. తన విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్తున్నానని.. ఇక నుంచి హెల్మెట్ పెట్టుకుంటా.. చలానా వద్దని పోలీసులను వేడుకున్నాడు. అయినా పోలీసులు వినలేదు. అధికంగా విద్యుత్తు బిల్లులు వసూలు చేస్తున్నారు మీరు తప్పకుండా చలానా కట్టాల్సిందేనంటూ రూ.6000 చలానా విధించాడు. దీంతో ప్రతీకారంగా చాలా పోలీస్ స్టేషన్లు తమకు విద్యుత్తు బకాయిలున్నాయని.. రూ.56,000బకాయి ఉన్నందున థానా భవన్ పోలీస్ స్టేషన్ కు విద్యుత్తు సరఫరా నిలిపివేశాడు. పోలీస్ స్టేషన్ కు విద్యుత్తు సరఫరా అయ్యే విద్యుత్తు స్థంభం నుంచి వైర్లు కట్ చేసి విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై విద్యుత్తు శాఖలో కాంట్రాక్టు ఉద్యోగి మెమతాబ్ స్పందిస్తూ.. తన నెల జీతం రూ.5000 అని రూ.6000 తనకు చలానా విధించారని.. ఇక నుంచి రూల్స్ ఫాలో అవుతానని చెప్పినా.. వినకుండా జరిమానా విధించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే హెల్మెట్ ధరించకపోతే ఉత్తరప్రదేశ్ లో గరిష్టంగా రూ.2,000 వరకు చలానా విధిస్తారు. కాని మెహతాబ్ కు మూడు రెట్లు అదనంగా ఎందుకు చలానా విధించారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మెహతాబ్ బండిని ఆపి చలానా విధించిన సమయంలోనే ఎంతో మంది హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తున్నారని.. వారెవరిని పట్టించుకోకుండా తనకే చలానా విధించారని బాధితుడు ఆరోపించాడు. ఈఘటనపై పోలీసు అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..