పెళ్లి జరుగుతోంది.. తాళి కట్టే సమయానికి వచ్చి వధువును బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు.. ట్విస్ట్ ఏంటంటే

|

Jun 20, 2023 | 8:11 AM

కొన్ని సినిమాల్లో పెళ్లి వేడుక జరిగే సన్నివేశం వచ్చినప్పడు సరిగ్గా తాళికట్టే సమయానికి బయట నుంచి వచ్చిన వాళ్లు ఆంపడి అనే డైలాగ్ చెప్తారు. అమ్మాయి లేదా అబ్బాయిని ప్రేమించిన వారు, లేకపోతే పోలీసులు వచ్చి అర్ధాంతరంగా పెళ్లిని ఆపే సీన్లు ఎన్నో వచ్చాయి.

పెళ్లి జరుగుతోంది.. తాళి కట్టే సమయానికి వచ్చి వధువును బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు.. ట్విస్ట్ ఏంటంటే
Marriage
Follow us on

కొన్ని సినిమాల్లో పెళ్లి వేడుక జరిగే సన్నివేశం వచ్చినప్పడు సరిగ్గా తాళికట్టే సమయానికి బయట నుంచి వచ్చిన వాళ్లు ఆంపడి అనే డైలాగ్ చెప్తారు. అమ్మాయి లేదా అబ్బాయిని ప్రేమించిన వారు, లేకపోతే పోలీసులు వచ్చి అర్ధాంతరంగా పెళ్లిని ఆపే సీన్లు ఎన్నో వచ్చాయి. అయితే అచ్చం అలాంటి ఘటనే ఆదివారం రోజున కేరళలో జరిగింది. పెళ్లి జరుగుతుండగా.. పీటలపై పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూర్చోగా.. పోలీసులు వచ్చి బలవంతంగా పెళ్లి కూతురును లాక్కెళ్లడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. అలప్పుజా జిల్లా, కాయకులం అనే ప్రాంతానికి చెందిన అల్ఫియా, అఖిల్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ వారి మతాలు వేరు కావడంతో తమ పెళ్లికి వారి కుటుంబ సభ్యలు ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమిలేక అల్ఫియా తన ప్రియుడు అఖిల్‌తో కలిసి వేరే చోటుకి వెళ్లిపోయింది. వీరిద్దరు పెళ్లి చేసుకుందామని కొవలం ప్రాంతానికి సమీపంలో ఓ గుడికి వచ్చారు. అక్కడ వారి పెళ్లి జరుగుంతుండగా.. వరుడు తాళి కట్టే కొన్ని నిమిషాల ముందు పోలీసులు ఆ వేడుకలో తమ ఎంట్రీ ఇచ్చారు.

బలవంతంగా పెళ్లి కూతురుని లాక్కెళ్లారు. ఆమె వెంట వరుడు అఖిల్ కూడా వచ్చాడు. చివరికి ఆమెను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఓ సినియర్ పోలీస్ అధికారి వివరణ ఇచ్చారు. కాయకులం పోలీస్ స్టేషన్‌లో ఓ మిస్సింగ్ ఫిర్యాదు వచ్చిందని.. ఆ మహిళను కోర్టుకి తీసుకురావాలంటూ పోలీసులకు ఆదేశాలు అందాయని చెప్పారు. దీని ఆధారంగానే పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకురావాల్సి వచ్చిందని.. ఆ తర్వాత ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారని చెప్పారు. అయితే కోర్టులో అల్ఫియా తన అభిప్రాయాన్ని చెప్పింది. తన ఇష్టంతోనే అఖిల్‌తో వచ్చానని.. కొన్ని రోజుల క్రితమే అఖిల్‌ను పెళ్లి చేసుకునేందుకు అతనితో వెళ్లిపోతున్నానని చెప్పినప్పటికీ కూడా పోలీసులు బలవంతంగా తనను లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత కోర్టు ఆమెకు అఖిల్‌తో కలిసి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. సోమవారం రోజున తాము పెళ్లి చేసుకుంటామని… పోలీసులు తన పట్ల అసభ్యంగా వ్యవహరించిన తీరుపై కూడా ఫిర్యాదు చేస్తానని అఖిల్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..