Baby born mid-air on Air India: లండన్ నుంచి భారత్‌లోని కొచ్చికి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న కొద్ది సేపట్లోనే విమానంలో ఉత్కంఠ వాతావరణం అలుముకుంది. విమానంలోని ఓ గర్భిణికి ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. మహిళ ప్రసవ వేదనతో బాధపడుతున్న క్షణాలను చూసి అందరూ ఆందోళన చెందారు. చివరకు నెలలు నిండని ప్రసవం సుఖాంతమవ్వడంతో అందరరూ ఊపిరిపీల్చుకున్నారు. మహిళ ఎయిర్ ఇండియా విమానంలో ఓ గర్భిణి మంగళవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని భారత విమానాయన సంస్థ వెల్లడించింది. మంగళవారం లండన్ నుంచి కోచ్చిన్ ఎయిరిండియా విమానం బయలు దేరింది. ఈ క్రమంలో ప్రయాణికుల్లో ఓ మహిళకు ప్రసవ వేదన మొదలైంది.
అయితే..విమానంలో 210 మంది ప్రయాణిస్తుండగా.. వారిలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు ఉన్నారు. వెంటనే వీరంతా ఆ మహిళకు వైద్యం మొదలుపెట్టారు. నెలలు నిండని ప్రసవాన్ని వారు సుఖాంతం చేశారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు, బిడ్డకు వైద్య పర్యవేక్షణ అవసరం కావడంతో విమానాన్ని మార్గమధ్యంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో అత్యవసరంగా లాండింగ్ చేశారు. అనంతరం తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. వీరికి తోడుగా మరో ప్యాసింజర్ సైతం ఉన్నట్లు ఏయిరిండియా తెలిపింది. అనంతరం విమానం భారత్‌కు బయలుదేరింది.
#FlyAI : Baby on board!
AI 150 of 5th Oct, en route to Kochi from London with 202 pax, landed in Frankfurt with 203 passengers.
We had a surprise arrival mid air.A baby boy was born. (1/4) pic.twitter.com/SMDtBxb1ba
— Air India (@airindiain) October 6, 2021
(2/4) Kudos to our crew and special salute to doctors and medical staff on board for making this easy for the mother. Our aircraft is well equipped with all necessary medical equipment and our crew are experienced to handle this kind of eventuality. pic.twitter.com/xjh3UBYNS2
— Air India (@airindiain) October 6, 2021
Also Read: