
Spot the Owl: బోర్ కొట్టినా.. కాస్తంత స్పేస్ దొరికినా.. అందరూ సోషల్ మీడియా(Social Media)లోకి వెళ్లిపోతారు. అక్కడ టైమ్ పాస్ చేయడానికి చాలా కంటెంట్ ఉంటుంది. మెదడుకు మేత పెట్టే అనేక పజిల్స్ సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. అందులో ఫోటో పజిల్స్ కూడా ఓ భాగం. పజిల్స్ అంటే ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఎంత కష్టమైనా పనైనా సరే.. సాల్వ్ చేయాలని కొంతమంది ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అలాంటివారు ఎప్పుడూ సెల్ఫ్ కాన్పిడెన్స్‌తో ముందుకు సాగుతూ ఉంటారు. అందుకే ఎలాంటి పజిల్ కనబడినా.. దాని అంతు చూసే వరకు అస్సలు వదిలిపెట్టారు. కాగా ఫోటో పజిల్స్ మీ కళ్లలో ఎంత పవర్ ఉందో కూడా చెప్పేస్తాయ్. ఈ ఫోటో పజిల్స్ అందించేందుకు కొన్ని సోషల్ మీడియా పేజీలు కూడా ఉన్నాయి. ఇలాంటి పజిల్స్ కొన్ని ఈజీగా ఉన్నా, మరికొన్ని మాత్రం సరదా తీర్చేస్తాయి. తెగ తికమక పెడుతూ మనకి సవాల్ విసురుతాయి. వీడని చిక్కుముడిలా ఉండి మన కళ్లను మోసం చేస్తుంటాయి.
కాగా ఫోటో పజిల్స్ సాల్వ్ చేస్తే సూపర్ కిక్ వస్తుంది. తాజాగా ఓ పజిల్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రం మంచు కురిసే ప్రాంతంలోని అడవిలో తీసినదిగా తెలుస్తోంది. అందులో రెండు గుడ్లగూబలు దాగున్నాయి. ఒకదాన్ని సులభంగానే గుర్తించవచ్చు. రెండో దాన్ని గుర్తించాలంటే మాత్రం కాస్త శ్రద్ధ అవసరం. 100కు 60 మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో విఫలమయ్యారు. చూసిన కొద్ది సెకన్లలోనే 2వ గుడ్లగూబను కూడా కనిపెడితే.. మీరు గ్రేట్ అనే చెప్పాలి. ఎంతసేపు చూసినా.. కనిపించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దిగువ ఫోటోను చూసేయ్యండి. అక్కడ గుడ్లగూబలు ఎక్కడ ఉన్నాయి క్లియర్‌గా మార్క్ చేసి ఇచ్చాము.
Also Read: రైతు పొలం దున్నుతుండగా బయటపడిన అద్భుతం.. ఆనందంలో అన్నదాత