Viral News: సెల్ఫీ మోజులో పడి కుర్రకారు తమ ఉజ్వలమైన భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. ప్రాణంతాకమని తెలిసినా..వాట్సప్ స్టేటస్ లు పెట్టుకోవడానికి, సోషల్ మీడియా అకౌంట్లలో ప్రొఫైల్స్ గా పెట్టుకోవడానికి ఎంత రిస్కైనా చేస్తున్నారు. అదృష్టం బావుంటే బతికి బయటపడుతున్నారు. లేకుంటే సెల్ఫీ మోజులో ప్రాణాలు పొగొట్టుకున్న వారున్నారు. సరిగ్గా ఇలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అడవుతోంది.
కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు మార్గం మధ్యలో ఓ ఏనుగుల గుంపు కనిపించింది. దీంతో వెంటనే కారు ఆపేసి.. గజరాజులతో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించారు. ఫస్ట్ సెల్ఫీ దిగడం ఇష్టం లేనట్లు ముఖాన్ని పక్కకు పెట్టుకున్నాయి. అయినా సెల్ఫీ తీసేందుకు యువకులు ట్రై చేయడంతో కోపంతో యువకులను ఉరికించాయి ఏనుగులు.. దీంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని భయంతో పరుగులు తీశారు ఆఇద్దరు యువకులు. ఈవీడియోని తమిళనాడుకు చెందిన ఐఎఎస్ అధికారి సుప్రియా సాహూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. వన్యప్రాణులతో సెల్ఫీ క్రేజీ ఎంతో ప్రమాదకరం. ఈయువకులు అదృష్టవంతులు, క్షమించి వదిలేశాయి లేదంటే సరైన గుణపాఠం చెప్పడానికి ఆఏనుగులకు ఎంతో సమయం పట్టేది కాదంటూ వీడియోకు ట్వీట్ ను జత చేశారు సుప్రియా సాహు.
Selfie craze with wildlife can be deadly. These people were simply lucky that these gentle giants chose to pardon their behaviour. Otherwise, it does not take much for mighty elephants to teach people a lesson. video-shared pic.twitter.com/tdxxIDlA03
— Supriya Sahu IAS (@supriyasahuias) August 6, 2022
ఈవీడియోను చూసిన నెటిజన్లు తమదైన స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. ఎక్కువ మంది యువకుల చర్యను తప్పుపడుతుంటే..కొంతమంది మాత్రం జంతు సంరక్షణ చర్యల్లో భాగంగా యానిమల్ కారిడర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరికొందరైతే క్రేజీ పీపుల్..జరగరానిది జరిగితే అడవి జంతువులను నిందిస్తామంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సెల్ఫీల కోసం రిస్క్ చేయడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి