సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నెటిజన్ల హృదయాల్ని కదిలించేవిగా ఉంటాయి.. తాజాగా, మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో అలాంటి వీడియో కనిపించింది. ఈ వీడియోలో ఒక అందమైన రామచిలుక కాఫీ తాగుతూ కనిపించింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఔరా ఇదేం విచిత్రం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
అన్ని పక్షుల్లోకెల్లా రామ చిలుక అత్యంత తెలివైన పక్షిగా చెబుతారు. ఒకవైపు ప్రజల మాటలను అనుకరిస్తూనే ఎదుటివారిని బాగా అలరించగలదు. అందుకే ఇంటర్నెట్‌లో రామచిలుక గురించి చేసిన రకరకాల వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెటిజన్లకు ఆకట్టుకుంటోంది.. ఈ వీడియోలో, ఒక రామచిలుక కమ్మటి పాట కాదు.. కాఫీ చేస్తూ కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు అనేక రకాల కాఫీలు రుచి చూసి ఉంటారు. కానీ, రామచిలుక చేసిన కాఫీ మాత్రం ఎక్కడా కనిపించదు. పక్షి కాఫీ చేయడానికి కష్టపడుతున్న ఈ వీడియో చూస్తే మీరు అవాక్కవ్వాల్సిందే. ఈ వీడియోలో ఒక రామచిలుక కాఫీ చేయడానికి కప్పులో చెంచాను తిప్పడం కనిపిస్తుంది.
आप सबके लिए पैरट कॉफ़ी लाया हूँ दोस्तों
कौन कौन पीना चाहता है 😘 pic.twitter.com/tNlpSjGqch— Moj Clips (@MojClips) June 2, 2024
ఈ వైరల్ వీడియోను మైక్రో బ్లాగింగ్ సైట్ Xలో @MojClips హ్యాండిల్ షేర్ చేశారు. ఈ వైరల్ క్లిప్‌ను ఇప్పటికే వేలాది మంది వినియోగదారులు వీక్షించారు. వైరల్ ట్వీట్ 18 రోజుల క్రితం 2 జూన్ 2024న మైక్రో బ్లాగింగ్ సైట్ Xలో పోస్ట్ చేయబడింది. కేవలం 14 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్ చాలా మంది యూజర్లకు నచ్చింది. చాలా మంది వినియోగదారులు దీన్ని సేవ్ చేసి, పంచుకుంటారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..