
Viral News: ఆడపిల్లలంటే చిన్న చూపు చూసే నేటి సమాజంలో ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. మగపిల్లాడు పుడితే సంబరాలు చేసుకుంటూ.. ఆడపిల్ల పుడితే బయటకు చెప్పుకోలేని పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో ఉన్నాయి. ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తుంటారు. కాని.. ఈసమాజానికి సృష్టి.. మూలం స్త్రీ అనే విషయాన్ని మర్చిపోయి.. అమ్మాయి పుడితే మేం దురదృష్టవంతులమనుకునే ఘటనలు చూస్తున్నాం. అమ్మాయి పుడుతుందని తెలిస్తే అవసరమైతే పురిటిలోనే చంపేసే సంఘంటనలు చూస్తున్నాం. ఇదే సమాజంలో అమ్మాయిని అదృష్టంగా భావించి.. ఎంతో ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ కూతరు పట్ల తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అమ్మాయిల పట్ల వివక్షత నివారించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా చాలామందిలో మార్పు కనిపించడంలేదు. కొందరు మాత్రం అమ్మాయి పుడితే తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని సంబరపడిపోతుంటారు. ఆడపిల్ల పుట్టిందని ఘనంగా స్వాగతం పలకడం, భారీ స్థాయిలో దావత్ ఇవ్వడం చూశాం.. వీటన్నింటికి కొంత వినూత్నంగా తమ కుమార్తె పాదాలను కడిగిన పాలను తాగుతూ తల్లిదండ్రులు కన్న కూతరుపై ప్రేమను చాటుకున్నారు. తమ కుమార్తెపై ప్రేమను వినూత్నంగా చాటాలనుకున్న తల్లిదండ్రులు.. తమ కూతుర్ని కుర్చీలో కూర్చోబెట్టి.. ఆమె పాదాల కింద పెద్ద స్టీల్ పాత్రను ఉంచారు. తర్వాత ఆమె పాదాలను తండ్రి నీళ్లతో కడిగారు. తర్వాత తెల్లని వస్త్రంతో పాదాలను తుడిచి.. కాలు కింద పెట్టనీయకుండానే మరో పళ్లెంలో ఉంచారు. తర్వాత పాదాలను పాలతో కడిగి వాటిని ఓ గిన్నెలో పోశారు. ఆ గిన్నెలో ఉంచిన పాలను తల్లిదండ్రులిద్దరూ కొంచెం కొంచెం తాగి.. తర్వాత మరో పళ్లెంలో కుమార్తె కాళ్లను ఉంచి మళ్లీ నీటితో కడిగారు. ఆ తర్వాత తెలుపు రంగు వస్త్రాన్ని ముందు పెట్టి.. మరో పాత్రతో సిద్ధం చేసిన ఎరుపు రంగు నీళ్లలో ఆమె పాదాలను ముంచి, తెలుపు రంగు వస్త్రంపై పెట్టించి.. ఆమె ముద్రలను తీసుకుని ఇలా తమ కూతురిపట్ల తమ ప్రేమను చాటు కున్నారు.
ఈ వీడియోను జార్ఖండ్ కు చెందిన సంజయ్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఎమోషనల్ మూమెంట్ అనే క్యాప్షన్ ను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆడపిల్లలంటే తక్కువచూసే వారికి ఈవీడియో కనువిప్పు కావాలంటున్నారు నెటిజన్లు.
भावुक पल..
विदाई से पूर्व बेटी के पद-चिन्हों को घर में संजोकर रखते मां-बाप..?#HeartTouching
VC : SM pic.twitter.com/kJdF8dj4e6— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) August 22, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..